PM Modi: ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే’.. వేములవాడ సభలో ప్రధాని మోదీ..

|

May 08, 2024 | 11:33 AM

తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమన్నారు ప్రధాని మోదీ. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మే 7న దేశంలో మూడోవిడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిందని అందులో ఇండియా కూటమి ఫ్యూజ్ పోయిందని విమర్శించారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగితే మూడింటిలో ఇండియా కూటమి ఫ్యూజ్ పోయిందని ఎద్దేవా చేశారు. వేములవాడకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.

PM Modi: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే.. వేములవాడ సభలో ప్రధాని మోదీ..
Pm Modi Vemulawada
Follow us on

తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమన్నారు ప్రధాని మోదీ. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మే 7న దేశంలో మూడోవిడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిందని అందులో ఇండియా కూటమి ఫ్యూజ్ పోయిందని విమర్శించారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగితే మూడింటిలో ఇండియా కూటమి ఫ్యూజ్ పోయిందని ఎద్దేవా చేశారు. వేములవాడకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ప్రధానితోపాటు హెలిప్యాడ్ వద్దకు మరో నాలుగు హెలికాప్టర్లు చేరుకున్నాయి. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు హుజూరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ నేతలు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు అయన. సభావేదకపైకి చేరుకున్న వెంటనే మోదీకి పలువురు బీజేపీ నేతలు శాలువాలు కప్పి సన్మానించారు. సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు గతంలోలాగే అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడుతూ కార్యకర్తల్లో జోష్ నింపారు. దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మీ ఓటు వల్లే తాను ఎన్నో నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రజలకు తెలిపారు. మే 7న దేశంలో మూడోవిడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిందని అందులో ఇండియా కూటమి ఫ్యూజ్ పోయిందని విమర్శించారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగితే మూడింటిలో ఇండియా కూటమి ఫ్యూజ్ పోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే విజయరథయాత్ర ప్రారంభమైందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని ఆరోపించారు. తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు.

 

బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్‎లకు ఫ్యామిలీ ఫస్ట్ అంటూ విమర్శించారు. పీవీని కాంగ్రెస్ పార్టీ అవమానించింది అన్నారు. పీవీ పార్థీవదేహాన్ని గతంలో కాంగ్రెస్ తన ఆఫీస్‎లో కూడా అనుమతించలేదన్నారు. పీవీకి తమ ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసిందన్నారు. పీవీ నరసింహరావు కుటుంబంలో రెండు, మూడు తరాలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలిపారు. అవినీతి అనేది కాంగ్రెస్, బీఆర్ఎస్‎లో కనిపించే ప్రధాన లక్షణం అని విమర్శించారు. కాంగ్రెస్‎పై ఓటుకు నోటు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోయిందన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే తెలంగాణలో అందరికీ తెలుసని సీఎం రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు. వసూళ్లలో ఆర్ఆర్ఆర్ సినిమాను మించిపోయిందని ఎద్దేవా చేశారు. అంబానీ, ఆదానీలను ఇన్నాళ్లు విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు విమర్శించడం లేదన్నారు. వారి నుంచి ఎంత తీసుకుందని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‎లు పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణను ఆర్ఆర్ నుంచి విముక్తం చేయాలన్నారు. కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలు ఓబీసీలకు నష్టం కలిగిస్తుందన్నారు. అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ లాక్కొని ముస్లీం సామాజికవర్గానికి ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రయాత్నిస్తోందన్నారు. మాదిగ సామాజికవర్గానికి రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అడ్డుపడుతోందన్నారు.

ఇవి కూడా చదవండి

మోదీ ప్రసంగం లైవ్ వీడియో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..