పంది కడుపులో ఏనుగు..ఏం జరగబోతుంది..?

పంది కడుపులో ఏనుగు పిల్ల జన్మించిన వింత సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గూడూరు మండలం నాయకపల్లి  గ్రామంలో ఓ పంది ఏనుగు పిల్లకు జన్మనిచ్చింది. పందికి ఏనుగు పిల్ల జన్మించడం పట్ల స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. గ్రామానికి చెందిన రాయపురం సారయ్య అనే వ్యక్తి పందుల ను పెంచి పోషించేవాడు. ఈ ఉదయం పంది ప్రసవించగా, ఏనుగు ఆకారంలో ఉన్న వింత జీవి జన్మించింది. తొండం, దంతాలు, పాదాలు అన్నీ ఏనుగును పోలి […]

పంది కడుపులో ఏనుగు..ఏం జరగబోతుంది..?

పంది కడుపులో ఏనుగు పిల్ల జన్మించిన వింత సంఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గూడూరు మండలం నాయకపల్లి  గ్రామంలో ఓ పంది ఏనుగు పిల్లకు జన్మనిచ్చింది. పందికి ఏనుగు పిల్ల జన్మించడం పట్ల స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. గ్రామానికి చెందిన రాయపురం సారయ్య అనే వ్యక్తి పందుల ను పెంచి పోషించేవాడు. ఈ ఉదయం పంది ప్రసవించగా, ఏనుగు ఆకారంలో ఉన్న వింత జీవి జన్మించింది. తొండం, దంతాలు, పాదాలు అన్నీ ఏనుగును పోలి ఉన్నాయి.

అయితే పుట్టిన కొద్ది క్షణాలకే ఆ వింత ఆకారం గల జంతువు మృతి చెందింది. గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామల ప్రజలు సైతం తండోపతండాలుగా ఆ వింతను చూడటానికి నాయకపల్లి గ్రామానికి తరలి వస్తున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన మాటలే ఇప్పుడు నిజమవుతున్నాయంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే..పంది కడుపులో ఏనుగు పిల్ల జన్మించడంలో ఎటువంటి అద్భుతాలు లేవంటున్నారు జన విజ్ఞాన వేత్తలు. దీని వెనక దేవుని మయా, మర్మాలు ఏమీ లేవని, జంతువులలోని జన్యులోపాల కారణంగా వికృత రూపంలో జన్మించి ఉండవచ్చని విజ్ఞాన వేత్తలు అభిప్రాయ పడుతున్నారు. పంది కడుపులో ఏనుగు పిల్ల కాదని జన్యు లోపం కారణంగానే ఏనుగు రూపంలో పంది జన్మనిచ్చిందని వారు చెబుతున్నారు.