Telangana: మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాక్.. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పలువురి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ

|

Nov 30, 2024 | 1:23 PM

పీజీ మెడికల్ సీట్ల స్కామ్‌లో. అవకతవకలు గుర్తించిన ఈడీ చర్యలకు దిగింది. మూడు మెడికల్ కాలేజీలకు సంబధించి కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసింది.

Telangana: మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాక్.. మాజీ మంత్రి మల్లారెడ్డి సహా పలువురి ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
Ed On Pg Medical Seats Scam
Follow us on

తెలంగాణలో మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు షాకించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్. అవకతవకలు రుజువు కావడంతో పెద్ద మొత్తంలో ఆస్తుల్ని సీజ్ చేసింది. రూ. 9.71కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేశారు ఈడీ అధికారులు. ఇందులో మాజీమంత్రి మల్లారెడ్డి కాలేజీకి చెందిన 2.89 కోట్లు, ఎంఎన్‌ఆర్‌ మెడికల్ కాలేజీకి చెందిన 2.01 కోట్లు, చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి చెందిన 3.33 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్‌ చేశారు.

మెడికల్‌ సీట్లను బ్లాక్ చేసి పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు గతంలో రంగంలోకి దిగారు. అదే సమయంలో కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో గతంలో ఫిర్యాదు ఆధారంగా కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీల్లో మెరుపు దాడులు చేస్తూ కీలక సమాచారాన్ని రాబట్టారు. నీట్ పీజీ మెరిట్ ఆధారంగా కన్వీనర్ కోటా లేదంటే ఫ్రీ సీట్ల కింద చాలా మటుకు ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థుల పేర్లతో బ్లాక్ చేసినట్టు ఐడెంటిఫై చేశారు అధికారులు.

గతేడాది జూన్‌లో మల్లారెడ్డి నివాసంతో పాటు మెడికల్ కాలేజీ, ఆఫీసులపై ఈడీ సోదాలు నిర్వహించింది. కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. వేర్వేరు మెడికల్ కాలేజీ ప్రవేశాల్లో 2016 నుంచి 2022 వరకు అవకతవకలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. అలాగే ఎంఎన్‌ఆర్‌, చల్మెండ ఆనందరావు మెడికల్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. తాజాగా ఆ కాలేజీలకు సంబంధించిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అటాచ్‌ చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..