TGPSC: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా IAS అధికారి బుర్రా వెంకటేశం.. ఖరారు చేసిన రాష్ట్ర సర్కార్

కొత్త ఛైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.దీంతో TGPSC కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం డిసెంబర్‌ 2న బాధ్యతలు చేపట్టనున్నారు.

TGPSC: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా IAS అధికారి బుర్రా వెంకటేశం.. ఖరారు చేసిన రాష్ట్ర సర్కార్
Burra Venkatesham
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 30, 2024 | 11:19 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా IAS అధికారి బుర్రా వెంకటేశం పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చైర్మన్‌ మహేందర్‌రెడ్డి పదవీకాలం డిసెంబర్‌ 3తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొత్త ఛైర్మన్ నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.దీంతో TGPSC కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం డిసెంబర్‌ 2న బాధ్యతలు చేపట్టనున్నారు.

ప్రస్తుతం విద్యాశాఖ కార్యదర్శిగా బుర్రా వెంకటేశం కొనసాగుతున్నారు. ఐఎఎస్ అధికారిగా ఉన్న వెంకటేశం వీఆర్ఎస్ తీసుకోనున్నారు. ఇప్పటికే పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు బుర్రా వెంకటేశం. వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత వెంకటేశం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

కొత్త పదవి తర్వాత బుర్రా వెంకటేశం తొలిసారిగా స్పందించారు. TGPSC చైర్మన్‌గా డిసెంబర్‌ 2న బాధ్యతలు చేపడతానని బుర్రా వెంకటేశం తెలిపారు. VRSకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నానని, కొత్త బాధ్యతలు స్వీకరించడానికి.. ఇప్పుడున్న పదవి నుంచి వైదొలగాల్సిందేనని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచినందుకు బుర్రా వెంకటేశం ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..