AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ డ్యామ్‎లో తగ్గిన నీటి నిల్వలు.. ఇరుపార్టీల మధ్య రాజుకున్న జల జగడం..

నీటి ఎద్దడిపై పొలిటికల్ వార్ కొనసాగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ విధానాల కారణంగానే కరువు ఏర్పడిందని బిఆర్ఎస్ చెబుతుంటే.. లేదు లేదు గత ప్రభుత్వం తప్పిదం కారణంగా ఇప్పుడు కరువును ఎదుర్కొంటున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Telangana: ఆ డ్యామ్‎లో తగ్గిన నీటి నిల్వలు.. ఇరుపార్టీల మధ్య రాజుకున్న జల జగడం..
Telangana
G Sampath Kumar
| Edited By: |

Updated on: Mar 26, 2024 | 6:52 PM

Share

నీటి ఎద్దడిపై పొలిటికల్ వార్ కొనసాగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ విధానాల కారణంగానే కరువు ఏర్పడిందని బిఆర్ఎస్ చెబుతుంటే.. లేదు లేదు గత ప్రభుత్వం తప్పిదం కారణంగా ఇప్పుడు కరువును ఎదుర్కొంటున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ రెండు పార్టీలు నీటిపై రాజకీయం చేయడం తగదని బిజెపి నేతలు అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు రాజకీయం మొత్తం నీటి చుట్టే తిరుగుతోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గడంతో నీటి ఎద్దడి మొదలైంది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో అన్నదాతలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధాన నీటి ప్రాజెక్టు అయిన లోయర్ మానేరు డ్యామ్‎లో నీటి మట్టం గణనీయంగా తగ్గుతుంది. దీంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయడం కష్టంగా మారింది. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వరి పంట కోత దశలో ఉంది. ఇదే సమయంలో తీవ్రమైన ఎండలు కొనసాగుతున్నాయి. దీంతో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. పంటను కాపాడుకోలేకపోతున్నారు రైతులు. ప్రాజెక్టుల్లో నీటి శాతం తగ్గడానికి కారణం.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీనికి గులాబీ నేతలు కౌంటర్‎గా కాంగ్రెస్ విధానాలతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నీటి సమస్యకు కారణం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోతలు చేయడం లేదని అంటున్నారు.

ఇలా ఈ రెండు పార్టీల నేతలు నీటి పైన విమర్శలు చేసుకుంటున్నారు. బిజెపి మాత్రం.. నీటి విషయంలో రాజకీయం చేయవద్దని.. పంటలను కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని అంటున్నారు. లోయర్ మానేరు డ్యామ్ కెపాసిటీ 24 టీఎంసీలు ప్రస్తుతం 5 టీఎంసీ నీరు మాత్రమే ఉంది. ఇప్పటికే తాగు నీటి కష్టాలు మొదలయ్యాయి. కరీంనగర్‎లో రెండు రోజులకు ఒక్కసారి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఎల్ఎండీ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా 3200 క్యూస్సేక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు నుంచి లోయర్ మారేరు డ్యామ్‎కు కేవలం 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో రెండు టీఎంసీల నీరు తగ్గితే మట్టి నీరు వచ్చే అవకాశం ఉంది. Lmd ప్రాజెక్ట్ చూస్తే బాధనిపిస్తుందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అంటున్నారు. మార్చి చివరి వారంలోనే డెడ్ స్టోరేజ్‎కి చేరుకుందని చెబుతున్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా నీటి సమస్య ఏర్పడిందంటున్నారు. కరీంనగర్‎లో ఇప్పుడు తాగు నీటి కష్టాలు మొదలయ్యాయని నగర మేయర్ సునీల్ రావు చెబుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…