దుష్టశక్తి అంతానికే పొత్తులు.. నచ్చకపోయినా హైకమాండ్ నిర్ణయమే ఫైనల్: ఏపీ బీజేపీ

ఏపీలో విపక్ష కూటమి రూపుదాల్చిన క్షణం నుంచి.. ఏదో కుతకుత వినిపిస్తూనే ఉంది. మిత్రపక్షాల్లో ఏదో కలకలం కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే సీట్ల విషయంలో చిచ్చు రగులుకున్న వేళ.. తాజాగా, ఏపీ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌ దుమారం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయాలని భావించినా..

దుష్టశక్తి అంతానికే పొత్తులు.. నచ్చకపోయినా హైకమాండ్ నిర్ణయమే ఫైనల్: ఏపీ బీజేపీ

|

Updated on: Mar 26, 2024 | 6:52 PM

ఏపీలో విపక్ష కూటమి రూపుదాల్చిన క్షణం నుంచి.. ఏదో కుతకుత వినిపిస్తూనే ఉంది. మిత్రపక్షాల్లో ఏదో కలకలం కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే సీట్ల విషయంలో చిచ్చు రగులుకున్న వేళ.. తాజాగా, ఏపీ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌ దుమారం రేపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయాలని భావించినా.. పరిస్థితులు దృష్ట్యా కూటమిలో భాగమయ్యామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. నాయకుల్లో కొందరికి నచ్చకపోయినా… హైకమాండ్‌ నిర్ణయాన్ని అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. కేవలం, రాష్ట్రంలో దుష్టశక్తిని అంతం చేసేందుకే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందంటూ.. పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలకు అదే స్థాయిలో వైసీపీ నుంచి కౌంటర్‌ పడింది. పూర్తిగా చంద్రబాబు మాయలో పడిపోయినట్టుగా పురంధేశ్వరి మాట్లాడుతున్నారని విమర్శించారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.

Follow us