OU Fake Certicates: దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒకటి. ఇప్పుడు ఉస్మానియాలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు ఓయూ విద్యార్థి నాయకులు. ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్న విద్యార్థిపై సీపీకి ఫిర్యాదు చేశారు. కన్సల్టేషన్, ఎడ్యుకేషన్, ఇనిస్టిట్యూట్స్ అడ్డగా ఈ దందా సాగుతుందని సీపీ దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థి సంఘాల నేతలు. ఫిర్యాదుతో సహా తగిన ఆధారులను సీపీకి అందజేసినట్టు వెల్లడించారు విద్యార్థులు.
ఇలా ఎంతో మంది నకిలీ సర్టిఫికెట్లు పొందారో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘ నాయకులు. చాలామంది ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లారని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఈ వ్యవహారం వెనుక అధికారుల పాత్రపై విచారణ చేయాలని కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని, నిందితులను అదుపులోకి తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు విద్యార్థి సంఘాల నేతలు. అటు ఈ నకిలీ సర్టిఫికెట్ వ్యవహారాన్ని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కూడా ధృవీకరించారు. దీంతో వర్సిటీ అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో పేరున్న యూనివర్సిటీలో ఇలాంటి పనులేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు.
Also read:
Richest Man: 7 నిమిషాల్లోనే కోటీశ్వరుడైన యూట్యూబర్.. ఎలన్ మస్క్‌ను సైతం వెనక్కి నెట్టేశాడు..
Singareni news: సింగరేణి కార్మికులకు రూ.40 లక్షలు బీమా.. వేతనం, హోదాకు సంబంధం లేకుండా..