నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్‌ రన్‌‪.. మన తెలంగాణ నుంచే..

| Edited By: Jyothi Gadda

Dec 14, 2024 | 9:47 AM

ఎద్దుమైలారం ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో తయారైన నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్లకు మల్కాపూర్‌ చెరువులో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. 14.5 టన్నుల బరువుతో ఉన్న ఈ యుద్ధ ట్యాంకర్లపై దాదాపు 10 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్‌ రన్‌‪.. మన తెలంగాణ నుంచే..
Flotation Test Of BMP War Tank
Follow us on

యుద్ధ ట్యాంకుల తయారీలో దూసుకెళ్తోంది సంగారెడ్డి జిల్లాలోని ఆర్డినెన్స్​ఫ్యాక్టరీ. భూమిపైన, నీటిలోన శత్రువులను ఎదుర్కోవడానికి ఇవీ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి..ప్రతి ఏటా ఇక్కడి నుంచి ఆర్మీకి యుద్ధ ట్యాంకులు అందుతున్నాయి. ఈరోజు కూడా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్ద చెరువులో బీఎంపీ.. బీఎంపీ 2 కె అనే రెండు యుద్ధ ట్యాంకర్లను ట్రయల్ రన్ చేశారు..

కంది మండలం ఎద్దు మైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ప్రతి ఏటా 120 ఈ యుద్ధ ట్యాంకర్ల వాహనాలను తయారుచేసి మల్కాపూర్ పెద్ద చెరువులో ట్రయల్ రన్ చేస్తారు..అయితే వీటిని ఆర్మీ యుద్ధాలలో ఎక్కువగా వాడుతారు..వీటి బరువు 14 టన్నులు ఉంటుంది… ఈ వాహనాలు రోడ్డు పై 65 కిలోమీటర్ల వేగంతో…నీటిలో 8 కిలోమీటర్ల వేగంతో పడవలాగ వెళ్తాయి..ఈ యుద్ధ వాహనం తయారీకి 8 నుండి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని సమాచారం. నీళ్లలో ఏడు నుంచి 8 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లడం, అదే విధంగా రోడ్డుపై 30 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తుందని ఓడీఎఫ్ అధికారులు చెబుతున్నారు. యుద్ధ సమయంలో సైనికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి ఈ వాహనాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఈ వాహనాలు రష్యా టెక్నాలజీతో తయారు చేస్తారు..సైనికులకు ఇప్పటివరకు 3 వేల వాహనాలకు పైగా మెదక్ ఓడీఎఫ్ నుంచి పంపినట్లు అధికారులు తెలిపారు.ఈ యుద్ధ వాహనాలు ఓడీఎఫ్‌లో ఒకసారి తయారైన వాటిని 15 నుంచి 20 సార్లు వివిధ రకాల టెస్ట్‌లు చేసిన తర్వాత, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని నిర్దారించుకుని, ఆ తర్వాత భారత మిలిటరీకి పంపడం జరుగుతుంది..కాగా నేడు మల్కాపూర్ పెద్ద చెరువు వద్ద యుద్ధ ట్యాంకుల ట్రయల్ రన్ చూసేందుకు పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..