AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మత్తుగాళ్లకు నిద్ర లేకుండా చేస్తోన్న ఈగల్ టీమ్.. 50 మంది విదేశీయుల అరెస్ట్..

తెలంగాణ ఈగల్ టీమ్ న్యూ ఇయర్ వేడుకల ముందు డ్రగ్స్ కంట్రోల్‌కు భారీ ఆపరేషన్ చేపట్టింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌తో కలిసి అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించి, 50 మందికి పైగా విదేశీయులను అరెస్టు చేసింది. హైదరాబాద్, వైజాగ్ వంటి ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరాను అడ్డుకుంది.

Telangana: మత్తుగాళ్లకు నిద్ర లేకుండా చేస్తోన్న ఈగల్ టీమ్.. 50 మంది విదేశీయుల అరెస్ట్..
Hyderabad Eagle Team
Krishna S
|

Updated on: Nov 28, 2025 | 8:09 AM

Share

న్యూ ఇయర్ వచ్చేస్తోంది.. నెక్ట్స్‌ లెవల్‌ సెలబ్రేషన్స్‌ కోసం పబ్బులు, రిసార్టుల్లో ఇప్పట్నుంచే ప్రిపరేషన్స్ మొదలయ్యాయ్యి.. అయితే ఈ సెలబ్రేషన్స్‌లో కీ రోల్‌ మత్తు పదార్ధాలదే.. దీంతో వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే… ఆ ప్రయత్నాలను వ్యూహాత్మకంగా తిప్పికొడుతోంది ఈగల్‌ టీమ్. మత్తు పదార్ధాలు రాష్ట్రానికి వచ్చాక యాక్షన్‌ మొదలుపెట్టడం కాదు… అసలు రాకుండా రూట్స్‌ను కట్‌ చేసేందుకు బిగ్ ఆపరేషన్‌ చేపట్టి సూపర్ సక్సెస్ అయ్యింది.

తెలంగాణలో మత్తుగాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది ఈగల్ టీమ్. ఆ మత్తును సరఫరా చేస్తున్న కేటుగాళ్ల భరతం పడుతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌గా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. వరుస ఆపరేషన్లతో ఇటు మత్తుగాళ్లు, అటు పెడ్లర్లకు దడ పుట్టిస్తున్న ఈగల్‌ టీమ్‌కు ఇప్పుడు న్యూఇయర్‌ పేరుతో బిగ్‌ టాస్క్‌ వచ్చి పడింది. మత్తు పదార్థాలు కీ రోల్‌ ప్లే చేసే న్యూఇయర్ వేడుకలకు ఒక్క గ్రాము కూడా వెళ్లకుండా. సప్లై చైన్‌నే బ్రేక్‌ చేసే పనిలో పడింది. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్‌ చేపట్టి డ్రగ్స్‌ ముఠాల గుట్టురట్టు చేసింది. జాయిన్ ఆపరేషన్లతో కంత్రీగాళ్ల జాయిట్లు విరగ్గొడుతోంది.

తెలంగాణ ఈగల్‌ టీమ్‌, ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ సంయుక్తంగా చేపట్టిన బిగ్ ఆపరేషన్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ బాగోతం బట్టబయలైంది. 20 కీలక లొకేషన్స్‌లో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 50 మందికి పైగా విదేశీయులు అరెస్ట్‌ అయ్యారు. ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌తో పాటు 124 మంది ఈగల్ టీమ్ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచే హైదరాబాద్‌, వైజాగ్, గ్వాలియర్‌, గౌహతికి డ్రగ్స్‌ వెళ్తున్నట్లు తేలడంతో… ఆ ప్రాంతాల్లోనూ సోదాలు ముమ్మరం చేశారు.

ఇక ఢిల్లీలో అరెస్ట్ చేసిన 50 మందిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్‌కు తీసుకొచ్చిన తర్వాత వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచి.. మరింత లోతుగా విచారించేందుకు కస్టడీకి తీసుకునే చాన్స్‌ కనిపిస్తోంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఆపరేషన్‌ సక్సెస్ కావడంతో అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ మూలాలను గుర్తించే పనిలో పడింది ఈగల్ టీమ్. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సంకేతాలిస్తోంది. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌లో డ్రగ్స్‌ అనేవే కనపడొద్దన్న టార్గెట్‌గా ముందుకెళ్తోంది ఈగల్ టీమ్. రాష్ట్రానికి ఎక్కడ్నుంచి అయితే డ్రగ్స్‌ వస్తున్నాయో… అక్కడ్నుంచే నరుక్కుంటూ వస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి