Rain Alert: వచ్చేసిందండోయ్ వాన కబురు.. ఏపీ, తెలంగాణలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా

తెలంగాణతో పాటు భారతదేశం నుంచి పూర్తిగా నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయి. దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోనికి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. దక్షిణ , మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తూర్పు, ఈశాన్య గాలులు ట్రోపోస్పిరిక్ ఎత్తులో వ్యాపించాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి మరి.

Rain Alert: వచ్చేసిందండోయ్ వాన కబురు.. ఏపీ, తెలంగాణలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా
Telangana Weather Update

Updated on: Oct 17, 2025 | 9:11 AM

నైరుతి ముగిసింది. ఇప్పుడు ఈశాన్య రుతుపవనాల వంతు వచ్చింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో.. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది వాతావరణశాఖ. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ అధికారులు. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు.

ఈశాన్య రుతుపవనాల ప్రభావం తెలంగాణపైనా ఉంది. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు పడతాయన్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్, నల్గొండ, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ అధికారులు. రేపు నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు పడతాయన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు.. కారులోనే దుకాణం పెట్టేశారుగా.. సీన్ కట్ చేస్తే