Kalyana Laxmi Scheme: కల్యాణ లక్ష్మి లబ్ధిదారుల సంఖ్య 11 లక్షలు దాటిన సందర్భంగా నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్త ఆధ్వర్యంలో లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు నూతన వధూవరులకు చెక్కులతో పాటు స్వంత ఖర్చుతో బట్టలను పంపిణీ చేశారు. అనంతరం వారితో కలిసి ఎమ్మెల్యే బిగాలా సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాల సంతోషంగా ఉన్నపుడే బంగారు తెలంగాణ సాధ్యమని నమ్మిన సీఎం కేసీఆర్.. పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వరకు అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని తెలిపారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా మహిళల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. నిరుపేద ఆడపిల్లల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి వరం లాంటిదని వివరించారు. ఇప్పటి వరకు 11 లక్షలు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేయడం గర్వకారణంగా ఉందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఈ బృహత్తర కార్యక్రమం లేదని గుర్తుచేశారు. నిరుపేద ఆడబిడ్డ ఆశీస్సులు సీఎం కేసీఆర్‌కు ఎప్పటికీ ఉంటాయి అని చెప్పారు. కార్యక్రమంలో రెడ్ కో ఛైర్మెన్ అలిమ్మ్, మేయర్ నీతూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Also read:
AP Weather Alert: మండుటెండల్లో చల్లని కబురు.. ఆ ప్రాంతంలో రాబోయే మూడు రోజులపాటు..
Viral Video: సలామ్ జవాన్.. ఓ గర్భిణిని మంచంపై ఆస్పత్రికి మోసుకెళ్లిన సైనికుడు..
Saudi King: హాలీవుడ్ బ్యూటీకి భారీ రెమ్యునరేషన్ ప్రకటించిన సౌదీ రాజు.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?