Nirmal Election Result 2023: నిర్మల్‌లో సత్తా చాటిన మహేశ్వర్‌ రెడ్డి.. మంత్రి ఇంద్రకరణ్‌పై విజయం.

Nirmal Assembly Election Result 2023 Live Counting Updates: అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే అధికార పార్టీలోకి జంప్ అయి ఏకంగా మంత్రి‌ కూడా అయిపోయారు. ఆ తర్వాత 2018 లో టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డిపై 8 వేల పై చిలుకు ఓట్లతో మరోసారి ఘన విజయం సాధించారు. ముచ్చటగా మూడోవసారి బరిలో నిలిచి హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ తరుఫున బరిలో నిలిచారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

Nirmal Election Result 2023: నిర్మల్‌లో సత్తా చాటిన మహేశ్వర్‌ రెడ్డి.. మంత్రి ఇంద్రకరణ్‌పై విజయం.
Indrakaran Reddy, Srihari Rao, Maheshwar Reddy

Edited By:

Updated on: Dec 03, 2023 | 4:35 PM

Nirmal Assembly Election Result 2023 Live Counting Updates: నిర్మల్‌లో కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పై విజయం సాధించారు. ఇదిలాఉంటే.. నాలుగు వందల ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రాంతం నిర్మల్ నియోజక వర్గం. గొలుసు కట్టు చెరువులు, ఆనాటి రాజుల పాలనకు అద్దం పట్టే కోటలు , కొయ్యబొమ్మలు , పచ్చని అడవులు మొత్తంగా ప్రకృతి ప్రసాదంగా కనిపించే ప్రాంతం. రాజకీయంగా మాత్రం అందుకు పూర్తి విరుద్దం. నిత్యం గరంగరం పాలిటిక్స్ కి కేరాప్ అడ్రస్. గత కొంత కాలంగా మూడు స్కాంలు ఆరు‌కబ్జాలు అన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం కావడంతో ఈసారి ఎలాగైనా అధికార పార్టీకి చెక్ పెట్టాలని పాదయాత్రలనే నమ్ముకుంటోంది ప్రతిపక్షం. అధికార పార్టీ బీఆర్ఎస్ మాత్రం సంక్షేమ మంత్రం పటిస్తోంది. మరీ నిర్మల్ ప్రజలు ఎలాంటి తీర్పు నివ్వబోతున్నారు..? పాదయాత్రలనే నమ్ముకున్న ప్రతిపక్షాలకు నిర్మల్ నియోజక వర్గంలో ప్రతిఫలం దక్కుతుందా..? రాబోయే ఎన్నికల్లో ఎవరి సత్తా ఎంత..? నిర్మల్ నియోజకవర్గ ఓటర్ల మాటేంటి..? అన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

నిర్మల్ జిల్లాలో జనరల్ నియోజక వర్గం నిర్మల్. 1952 లో ఈ నియోజక వర్గం ఏర్పడింది. 1957లో స్వతంత్ర అభ్యర్థి గెలవగా, 1962 నుంచి 1978 వరకు కాంగ్రెస్ గెలుస్తూ వచ్చాయి. 1983 నుంచి 1994 వరకు తెలుగు దేశం పార్టీ తొలిసారిగా పాగా వేసింది. 1999, 2004ల్లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2014 లో కాంగ్రెస్ గూటికి చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు మహేశ్వర్ రెడ్డి. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ సీటు ఆశించి భంగపడ్డ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసి మహేశ్వర్ రెడ్డి పై సొంత చరిస్మాతో ఘన విజయం సాధించారు.

నిర్మల్, సోన్, దిల్వార్ పూర్, నర్సాపూర్, సారంగపూర్ , లక్ష్మణచందా , మామాడ ఏడు మండలాలతో కలిపి నియోజక వర్గంగా కొనసాగుతున్న నిర్మల్ లో మున్నూరు కాపులదే అత్యదిక ఓటు బ్యాంక్.. ఆ తర్వాత స్థానం మైనారిటీలది. ఈ నియోజక వర్గంలో పురుష ఓటర్లు 1,17,563 ఉండగా, మహిళలు 1,29,914.. మొత్తం ఓటర్ల సంఖ్య 2,47,495. కాగా 40 శాతం ఓట్లు ఏ నాయకుడు సాధిస్తే, వారిదే విజయం అని సర్వేల లెక్కలు చెప్తున్నాయి.

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే అధికార పార్టీలోకి జంప్ అయి ఏకంగా మంత్రి‌ కూడా అయిపోయారు. ఆ తర్వాత 2018 లో టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డిపై 8 వేల పై చిలుకు ఓట్లతో మరోసారి ఘన విజయం సాధించారు. ముచ్చటగా మూడోవసారి బరిలో నిలిచి హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ తరుఫున బరిలో నిలిచారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థులుగా నాలుగోసారి బరిలో నిలిచారు. ఈ సారి కూడా వీరి మధ్య టఫ్​ ఫైట్​నడవనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కే. శ్రీహరి రావు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు కోసం త్రిముఖ పోటీ ఉందని భావిస్తున్నారు.

32 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఇంద్రకరణ్ రెడ్డి సొంతం. 1987లో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ గా‌‌.. 1991లో ఆదిలాబాద్ ఎంపీగా… 1999, 2004 లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేగా , 2008 లో మరోసారి ఎంపీగా పని చేశారు ఇంద్రకరణ్ రెడ్డి. 2014లో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి… ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి దేవాదాయ , గృహ నిర్మాణ, న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో నిర్మల్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఇంద్రకరణ్ రెడ్డికి మరోసారి మంత్రి పదవి దక్కించుకున్నారు. దేవదాయ శాఖ మంత్రిగా కొనసాగిన నేతలకు పదవి‌గండం తప్పదన్న అనుమానాలను సైతం పటాపంచలు చేస్తూ రెండవ సారి దేవదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కూడా. రాబోయే ఎన్నికల్లో మరోసారి నిర్మల్ నుండి బరిలోకి దిగి చిరకాల కోరిక హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా విజయాన్ని సాధించాలనుకుంటున్నారు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్