Telangana: మందుబాబులా.. మజాకానా.! తాగారు.. ఊగారు.. రికార్డులు బ్రేక్ చేసి కలెక్షన్లు ఇచ్చారు..

న్యూ ఇయర్ వేళ మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రతీ ఏడాది కంటే ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు పెరిగాయి. నెల రోజుల సమయంలో ఖజానాకు లిక్కర్ ఆదాయం భారీగా జమ అయింది. కొత్త సంవత్సరం వేళ మద్యం అమ్మకాల పైన ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.

Telangana: మందుబాబులా.. మజాకానా.! తాగారు.. ఊగారు.. రికార్డులు బ్రేక్ చేసి కలెక్షన్లు ఇచ్చారు..
Liquor Sales

Edited By:

Updated on: Jan 02, 2026 | 1:29 PM

ఓరుగల్లు మద్యం ప్రియులు రికార్డులు బ్రేక్ చేశారు. మద్యం అమ్మకాలలో గత ఏడాది రికార్డును బద్దలు కొట్టి కొత్త సంవత్సరంలో సరికొత్త రికార్డు సృష్టించారు. న్యూ ఇయర్ వేడుకలలో తాగి ఊగి ఎక్సైజ్ శాఖ ఖజానాకు భారీగా కాసుల వర్షం కురిసేలా చేశారు. కొందరు తాగి రోడ్డెక్కి కాకిలా చేతికి చిక్కి కేసుల పాలయ్యారు. 2025 డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో రికార్డులు సృష్టించాయి. ఆ ఒక్క రోజే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 48 కోట్ల 73 లక్షల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి.. వీటిలో కేవలం ఒక్క హనుమకొండ జిల్లాలోనే రూ. 16కోట్ల 14 లక్షల అమ్మకాలు జరిగాయి.

అయితే 2024 డిసెంబర్ 31 నైట్ రూ.39 కోట్ల 50 లక్షల అమ్మకాలు జరగగా.. ఇప్పటివరకు ఉన్న ఆ రికార్డును ఈసారి బ్రేక్ చేశారు. ఏకంగా గత రికార్డును మించి పది కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 295 వైన్స్, 134 బార్లు ఉన్నాయి. వీటిలో డిసెంబర్ 31న ఒక్కరోజే రూ. 48.73 లక్షల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఇంట్లోనే స్నేహితులతో కలిసి మద్యం సేవించి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటే.. మరికొంతమంది మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్‌లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో 433 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. మద్యం సేవించి రోడ్డెక్కిన వారి వాహనాలు సీజ్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..