New Traffic Rules: మీ వాహనంపై 10 మించి చలాన్స్ ఉన్నాయా?.. ఇక రోడ్లపై తిరగడం కష్టమే.. ఎందుకంటే?
ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తూ ఇష్టం వచ్చినట్టూ డ్రైవ్ చేస్తూన్నారా?.. వాహనంపై ట్రాఫిక్ చలాన్‌లు ఉన్నా నన్నేవరకు పట్టుకుంటారులే అనుకుంటున్నారా? అయితే ఇక మీరు రోడ్లపై తిరగడం కష్టమే.. ఎందుకంటే.. మీ వాహనంపై 10 మంచి చలాన్స్ ఉండి.. మీరు ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే.. మీ వాహనాన్ని మీరు అక్కడే వదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకో తెలుసుకుందాం పదండి.

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వాహనదారులపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే 10 కంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహన యజమానులపై – ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఆపరేటర్లు,ద్విచక్ర వాహనదారులుపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రై-కమిషనరేట్‌లలోని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. అటువంటి వాహనాలను వెంటనే స్వాధీనం చేసుకుంటామని, పెండింగ్ బకాయిలను పోలీసు బృందాలు వాహన యజమానుల ఇళ్లకు వచ్చి వసూలు చేస్తారని తెలిపారు.
ఇటీవల కర్నూలులో జరిగిన వేమూరి కావేరి బస్సు ప్రమాద ఘటన తర్వాత ఈ చర్య తీసుకున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వాహనంపై రూ.40,000 విలువైన చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. ఈ సంఘటన కారణంగా ట్రాఫిక్ పోలీసులు రోడ్డు రవాణా అథారిటీ (ఆర్టీఏ) అధికారులతో సమన్వయం చేసుకుని పెండింగ్‌లో ఉన్న చలాన్ డేటాను రికవరీ చేసేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా మాదాపూర్ ట్రాఫిక్ డిసిపి టి. సాయి మనోహర్ మాట్లాడుతూ, ప్రైవేట్ బస్సులకు ప్రత్యేక డేటాబేస్ లేదని, ఎందుకంటే వీటిపై అతివేగం, నో-పార్కింగ్, ట్రాఫిక్ సిగ్నల్ జంప్ వంటి అనే ఉల్లంఘనలు వీటిపై నమోదు చేయబడ్డాయని తెలిపారు.
బైక్‌లు, ఫోర్-వీలర్లు, ఆటో-రిక్షాలు, ట్రావెల్ బస్సులు, ఇతర భారీ వాహనాల డేటాను వేరు చేయడానికి మేము RTA అధికారులతో కలిసి పని చేస్తామన్నారు. డేటా అప్‌డేట్ చేసిన తర్వాత, ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించినవారిని గుర్తించడం సులభం అవుతుంది” అని ఆయన అన్నారు.
అలాగే ప్రతిరోజు పెండింగ్ ఛలాన్స్‌ను డేటాను విశ్లేషించడానికి, ఎక్కవ ఛలాన్స్ పెండింగ్ ఉన్న వాహనాలను గుర్తించడానికి 20 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలా పట్టుబడిన వాహనాలపై చాలా కాలంగా ఛలాన్స్ పెండింగ్‌లో ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటారని.. మిగతా వాటిని నుంచి బకాయిలు వసూలు చేస్తారని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
