Telangana: డాక్టర్ రాలేదని గర్భవతికి కాన్పు చేసిన నర్సులు.. చివరికి ఏం జరిగిందంటే

|

May 30, 2023 | 4:44 PM

సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వాసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. డాక్టర్ రాలేదని నర్సులు చేసిన కాన్పు వికటించి శిశువు మృతిచెందడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే నడిగూడెం మండలం వెంకట రామపురానికి చెందిన మానస అనే మహిళ డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు.

Telangana: డాక్టర్ రాలేదని గర్భవతికి కాన్పు చేసిన నర్సులు.. చివరికి ఏం జరిగిందంటే
Baby
Follow us on

సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వాసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. డాక్టర్ రాలేదని నర్సులు చేసిన కాన్పు వికటించి శిశువు మృతిచెందడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే నడిగూడెం మండలం వెంకట రామపురానికి చెందిన మానస అనే మహిళ డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అయితే మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా మానసకు నొప్పులు వచ్చాయి. దీంతో సిబ్బంది వెంటనే వైద్యురాలికి సమాచారం అందించారు.

కానీ ఆమె ఆసుపత్రికి రాలేనని చెప్పింది. దీంతో నర్సులు మానసకు కాన్పు చేయాలని నిర్ణయించుకున్నారు. చివరికి నిర్లక్ష్యంగా ఆమెకు కాన్పు చేశారు. శిశువుకు ప్రమాదంగా ఉందని గుర్తించి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని హడావుడి చేశారు. ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వాసుపత్రిలో చిన్న పిల్లల వైద్యులు కూడా అందుబాటులో లేరు. అలాగే అంబులెన్స్ డ్రైవర్ కూడా ప్రైవేటు ఆసుపత్రికి రానని చెప్పాడు. ఈ కారణాల వల్లే తమ శిశువు మృతి చెందినట్లు కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..