Naveen Murder Case: నవీన్‌ హత్య కేసులో ప్రియురాలు నిహారికకు బెయిల్.. జైలు నుంచి విడుదల..

|

Mar 19, 2023 | 3:54 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ప్రియురాలు నీహారికకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో నిహారిక ఆదివారం జైలు నుంచి బయలకురానుంది. ఈ కేసులో ప్రథాన నిందితుడు..

Naveen Murder Case: నవీన్‌ హత్య కేసులో ప్రియురాలు నిహారికకు బెయిల్.. జైలు నుంచి విడుదల..
Naveen Murder Case
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ప్రియురాలు నీహారికకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో నిహారిక ఆదివారం జైలు నుంచి బయలకురానుంది. ఈ కేసులో ప్రథాన నిందితుడు హరిహర కృష్ణ ఏ1, అతని స్నేహితుడు హాసన్‌ ఏ2, ప్రియురాలు నీహారిక ఏ3 ముద్దాయిలుగు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఫోన్‌లలోని కీలక సమాచారాన్ని తొలగించినందుకు నిహారిక, హాసన్‌లను పోలీసులు తొలుత అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణలో నిహారిక, హాసన్‌లు హత్యకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో నిహారిక తొలుత విచారణకు నిరాకరించింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగడం కొసమెరుపు.

కాగా ఫిబ్రవరి 17వ తేదీన నల్గొండ జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యార్థి నవీన్‌ను అతని స్నేహితుడు హరిహర కృష్ణ హత్య చేసిన తీరు సంచలనంగా మారింది. నవీన్‌ హత్యకు నిహారిక ప్రేమ వ్యవహారమే కారణమని నిందితుడు హరిహరకృష్ణ పోలీసుల విచారణలో అంగీకరించాడు. ఈ హత్యోదంతం గురించి నిహారిక, హాసన్‌లకు తెలిసినా ఎవ్వరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచడం, వారి ఫోన్‌లోని చాటింగ్‌ను డిలీట్‌ చేయడం, నిందితుడికి తాము సాయం చేసినట్లు నిహారిక, హసన్‌లు అంగీకరించడం ఈ కేసులో కీలకంగా మారింది. సాక్ష్యాధారాలను చెరిపేసే ప్రయత్నం చేయడంతో నిహారిక, హరి స్నేహితుడు హసన్‌లు నిందితులుగా చేర్చి ఫిబ్రవరి 6వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితులు ఇద్దరని హయత్‌నగర్‌ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. నీహారికను చంచల్‌గూడ జైలుకు, హసన్‌ను చర్లపల్లి జైలుకు పోలీసులు తరలించారు. ఇటీవల నిహారిక బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఆమెకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు నవీన్ హత్యకు సంబంధించిన విచారణ కొనసాగుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.