దేశ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. దుర్గామాత రోజుకో అవతారంలో దర్శనం ఇస్తుండడంతో దానికి అనుగుణంగా భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రతీ రోజు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తూ తమ భక్తిని చాటి కుంటున్నారు. కొందరు కరెన్సీ నోట్లతో దుర్గాదేవిని అలంకరిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అమ్మవారికి 45 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు.
దేవీ నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు దుర్గాదేవి శ్రీమహాలక్ష్మి దేవీ అవతారంలో దర్శనమిచ్చింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లోఆర్యవైశ్య సంఘంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శమించిన అమ్మవారికి 45 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించి భక్తిని చాటుకున్నారు. వంద, 200,500 విలువైన కరెన్సీ నోట్లను దండలుగా అల్లి అమ్మవారి మెడలో పూలమాలగా అలంకరించారు. కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు. కరెన్సీ నోట్ల కట్టలను అమ్మవారి ఎదుట పళ్లెంలో నైవేద్యంలో ఏర్పాటు చేశారు. దుర్గాదేవి అమ్మవారిని ధనలక్ష్మి అవతారంలో పూజించారు. తమ కుటుంబాలను ప్రజలను ధనలక్ష్మి దేవి కటాక్షించాలని వేడుకున్నారు.
తొమ్మిది రోజుల పాటు ప్రతీ రోజు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరిస్తూ తమ భక్తిని చాటి కుంటున్నారు. 30 ఏళ్లుగా ఆర్యవైశ్య ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి రోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..