AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Raja Singh: రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు.. వెంటనే విడుదల చేయాలన్న కోర్టు..

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. మంగళ్‌హాట్‌లో ఖాదీర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు..

MLA Raja Singh: రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు.. వెంటనే విడుదల చేయాలన్న కోర్టు..
Mla Raja Singh (File Photo)
Sanjay Kasula
|

Updated on: Aug 23, 2022 | 7:53 PM

Share

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. మంగళ్‌హాట్‌లో ఖాదీర్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాజాసింగ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు..ఎమ్మెల్యే ఇంటి నుంచి  అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి నాంపల్లికోర్టుకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. 14వ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఆ తర్వాత రాజాసింగ్‌ తరఫు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది. 41 సీఆర్పీసీ కింద నోటీస్ ఇవ్వలేదన్న రాజాసింగ్ లాయర్ల వాదనతో ఏకీభవించింది కోర్టు. కేసు దర్యాప్తులో పోలీసు అధికారులకు సహకరించాలని న్యాయమూర్తి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఆదేశించారు.

అంతకు కోర్టుకు భారీగా చేరుకున్నారు అభిమానులు.. దీంతో నాంపల్లి కోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.. రాజాసింగ్‌ వ్యాఖ్యలపై ఎల్బీనగర్‌, వనస్థలిపురం, బాలాపూర్‌, కుషాయిగూడ పీఎస్‌లలో ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్‌లో కేసు నమోదైంది.

ఇక రాజాసింగ్‌ను జడ్జిముందు హాజరుపర్చారు పోలీసులు..అటు నాంపల్లి కోర్టు దగ్గర ఉద్రిక్తత వాతావరణ నెలకొంది..రాజాసింగ్‌ అనుచరులు కోర్టు ఆవరణలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు..దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల వారిని అడ్డుకున్నారు..దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది..అయితే ఆందోళనకారులను చెదరగొడుతున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరోవైపు మతపరంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌పై వేటు వేసింది బీజేపీ. పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అన్ని బాధ్యతల నుంచి తప్పించింది. శాసనసభ పక్ష నేత పదవి నుంచి తొలగించింది. మూడు రోజుల కిందట స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ షోపై అభ్యంతరం వ్యక్తం చేశారు రాజాసింగ్‌. అయినా మునావర్‌ షో ఆగలేదు.

దీంతో ఓ వీడియో విడుదల చేశారు రాజాసింగ్‌. అందులో మతపరంగా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిపై అర్ధరాత్రి నుంచి పాతబస్తీలో ఆందోళనలు కొనసాగాయి. దేశ వ్యాప్తంగానూ నిరసనలు జరిగాయి. చాలా చోట్ల రాజాసింగ్‌పై కేసులు నమోదయ్యాయి. పోలీసుల సూచనలతో రాజాసింగ్‌ వీడియోను డిలీట్‌ చేసింది యూట్యూబ్‌.

దీనిపై మళ్లీ రియాక్ట్‌ అయ్యారు రాజాసింగ్‌. తాను ఎవరి పేరును ప్రస్తావించలేదంటూనే మునావర్‌ షోపై విమర్శలు చేశారు. రెండో వీడియోను కూడా విడుదల చేస్తానని ప్రకటించారు. మరోవైపు చాలా చోట్ల ఆందోళనలు కొనసాగడం, కేసులు పెట్టిన నేపథ్యంలో ఈ ఉదయం రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు.

స్టాండప్‌ కమెడియన్‌ మునావర్‌ షో కేంద్రంగా మాటల తూటాలు పేలుతున్నాయి. షో వద్దని చెప్పినా వినకుండా పెడతారా అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే షకీల్‌. రాజాసింగ్‌ నాలుక కోస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

మరోవైపు సోషల్‌ మీడియాలో రాజాసింగ్‌ పెట్టిన వీడియోపై మజ్లిస్‌ ఆందోళనలు చేపట్టింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భగ్గు మన్న ఎంఐఎం శ్రేణులు, మనోభావాలు దెబ్బతీశారంటూ పలు పోలీసుస్టేషన్ల ఎదుట నిరసనలు తెలిపారు. పోలీసుల ఫిర్యాదుతో యూట్యూబ్‌ రాజాసింగ్‌ వీడియోను తొలగించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
తినేప్పుడు ఫుల్‌గా చెమటలు పడుతున్నాయా?.. అసలు కారణం ఇదే కావచ్చు
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ అవుట్.. రియాక్షన్ ఇదే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
పైకి చూస్తే మొక్కజొన్న చేను.. లోపల కథ వేరే..
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! చాణక్యుడి టిప్స్
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
గోంగూర రొయ్యల ఇగురు.. ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
పెళ్లికని దుబాయ్‌ వెళ్లితే రూ.1200000 బంగారం చెత్తలో పోయింది!
. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా..
ఉద్యోగులకు మోదీ సర్కార్ హోలీ ధమాకా.. మార్చిలో అకౌంట్లోకి భారీగా..
31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుతం... ఆ ఒక్క పరుగుతో చెత్త రికార్డ్
31 ఫోర్లు, 6 సిక్సర్లతో అద్భుతం... ఆ ఒక్క పరుగుతో చెత్త రికార్డ్
ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?
ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?