AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ డైరెక్టర్ నాతో అలా ప్రవర్తించాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత తెలిసి షాక్ అయ్యా.!

కాస్టింగ్ కౌచ్‌.. కాస్టింగ్ కౌచ్‌.. కాస్టింగ్ కౌచ్‌.. సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే ఈ పదం.. ఇప్పుడు మరోమారు సంచలనానికి కేంద్ర బిందువుగా అవుతోంది. సినిమాల్లో అవకాశాల కోసం కాస్టింగ్ కౌచ్‌ అనుభవం ఎదురైనట్లు ఇటీవల వరుసగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి .

ఆ డైరెక్టర్ నాతో అలా ప్రవర్తించాడు.. అప్పుడు అర్ధం కాలేదు.. తర్వాత తెలిసి షాక్ అయ్యా.!
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2026 | 9:04 AM

Share

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని, వర్క్ ప్లేస్ లో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2011లో విడుదలైన ‘తను వెడ్స్ మను’ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆ సమయంలో పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఆమె తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకున్న ఓ సినిమాలో స్వర నటించారు. మొత్తం 56 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ షెడ్యూల్ ప్రారంభమైన కొద్ది రోజులకే ఆ చిత్ర దర్శకుడి ప్రవర్తనలో ఊహించని మార్పు వచ్చిందని ఆమె తెలిపారు. ఆ తర్వాత నుంచి తనపై వేధింపులు మొదలయ్యాయని స్వర గుర్తుచేసుకున్నారు.

ఆ ఘటన తాలూకు మానసిక సంఘర్షణను వివరిస్తూ.. ‘‘ఆ సమయంలో నాకు ఎదురైన పరిస్థితి ‘లైంగిక వేధింపుల’ పరిధిలోకి వస్తుందనే అవగాహన కూడా నాకు లేదు. నాపై ఎలాంటి శారీరక స్పర్శ జరగకపోవడంతో, పని ప్రదేశంలో జరిగే వేధింపుగా దాన్ని నేను గుర్తించలేకపోయాను. అప్పట్లో నాకంటూ ఒక టీమ్ గానీ, సాయం అడిగేంతటి ఇండస్ట్రీలో పరిచయాలు గానీ లేవు. ఏం చేయాలో పాలుపోని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే, కొన్నేళ్ల తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీటూ’  ఉద్యమం సమయంలో ఇతర మహిళలు పంచుకున్న అనుభవాలను చదివిన తర్వాతే తనకు కనువిప్పు కలిగిందని స్వర చెప్పుకొచ్చారు. ‘‘వాళ్ల అనుభవాలు చదివినప్పుడు.. అప్పట్లో నాకు జరిగింది కూడా కచ్చితమైన వేధింపే కదా అని నాకు అర్థమైంది’’ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు స్వర భాస్కర్. ప్రస్తుతం స్వర భాస్కర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Swara Bhasker (@reallyswara)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆ డైరెక్టర్ నాతో అలా ప్రవర్తించాడు..
ఆ డైరెక్టర్ నాతో అలా ప్రవర్తించాడు..
స్వామియే శరణం అయ్యప్ప..! శబరిమల భక్తులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్
స్వామియే శరణం అయ్యప్ప..! శబరిమల భక్తులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్
భారీ ఆదాయం వచ్చే 5 చిన్న వ్యాపారాలు.. కానీ ఎవ్వరు పట్టించుకోరు..
భారీ ఆదాయం వచ్చే 5 చిన్న వ్యాపారాలు.. కానీ ఎవ్వరు పట్టించుకోరు..
మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులో దారుణం.. ఎయిర్ హోస్టెస్ హత్య!
మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులో దారుణం.. ఎయిర్ హోస్టెస్ హత్య!
అక్కడి అడవులలో అద్భుతం.. 20 అంగుళాల ఎత్తుండే అరుదైన శిలీంద్రం
అక్కడి అడవులలో అద్భుతం.. 20 అంగుళాల ఎత్తుండే అరుదైన శిలీంద్రం
భారత బ్యాటింగ్‌పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
భారత బ్యాటింగ్‌పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
కార్తీక మాసంలో ఈ తప్పులు చేయకండి.. చేస్తే పుణ్యఫలం దక్కదా?
కార్తీక మాసంలో ఈ తప్పులు చేయకండి.. చేస్తే పుణ్యఫలం దక్కదా?
తిరుమలకు వెళ్తున్నారా? మీకో బిగ్‌ అలర్ట్‌.. TTD కీలక సూచనలు..!
తిరుమలకు వెళ్తున్నారా? మీకో బిగ్‌ అలర్ట్‌.. TTD కీలక సూచనలు..!
విద్యార్థులకు అలర్ట్.. SSC పరీక్ష ఫీజుల చెల్లింపులు ప్రారంభం!
విద్యార్థులకు అలర్ట్.. SSC పరీక్ష ఫీజుల చెల్లింపులు ప్రారంభం!
పాక్‌పై భారత కుర్రాళ్ల దూకుడు వెనుక అసలు కారణం ఇదే
పాక్‌పై భారత కుర్రాళ్ల దూకుడు వెనుక అసలు కారణం ఇదే