Nagoba Jatara: జాతరకు వేళాయే..దారులన్నీ ఇంద్రవెల్లి వైపే.. మహాపూజతో ఆదివాసీ ఉత్సవం షురూ..

| Edited By: Jyothi Gadda

Feb 09, 2024 | 11:00 AM

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు..ఆలయం దగ్గర బారికేడ్లు పెట్టి పురుషులు, మహిళలు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేయగా..నాగోబా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించి, కోనేరును శుభ్రపరిచారు.. జాతరలో నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేశారు..మహిళలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మేరకు RTC బస్సులు నడిపేలా ప్లాన్ చేశారు.

Nagoba Jatara:  జాతరకు వేళాయే..దారులన్నీ ఇంద్రవెల్లి వైపే.. మహాపూజతో ఆదివాసీ ఉత్సవం షురూ..
Nagoba Jatara
Follow us on

ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది..పుష్యమాస అమవాస్యను పురస్కరించుకుని నేటి రాత్రి 10.30 గంటలకు పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం చేస్తారు మెస్రం వంశీయులు..అనంతరం మహాపూజతో అర్థరాత్రి 12 గంటలకు నాగోబా తొలి‌దర్శనం ఇవ్వనుంది..ఈ నెల12న గిరిజన మహా దర్బార్ నిర్వహిస్తారు.రాష్ట్రంలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన నాగోబా జాతరను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

నాగోబా జాతర ఆదివాసీ సమాజానికి కీలకమైన పండుగ. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఆదివాసీ సమాజాన్ని ఐక్యం చేసే మహా జాతరగా నాగోబాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా ఆ నిమిషాన పురివిప్పి నాట్యం అడుతాడని .. సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నాగోబా ఆలయంలో పూజారులకు ఆదిశేషువు కనిపిస్తాడనీ.. వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడనిన మెస్రం వంశీయుల అపార నమ్మకం.

ఈ జాతరకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి గిరిజనులు వేలాదిగా తరలివస్తారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలు, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు..ఆలయం దగ్గర బారికేడ్లు పెట్టి పురుషులు, మహిళలు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేయగా..నాగోబా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించి, కోనేరును శుభ్రపరిచారు.. జాతరలో నిరంతరం విద్యుత్‌ సరఫరా ఉండేలా ఏర్పాట్లు చేశారు..మహిళలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన మేరకు RTC బస్సులు నడిపేలా ప్లాన్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..