Nagarjuna Sagar: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. ఎగువ కృష్ణ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు కృష్ణ బేసిన్ లోని రిజర్వాయర్లన్నీ నిండాయి. దీంతో ఎగువ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 22 క్రస్ట్ గేట్లని ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగిన నాగార్జునసాగర్ లో ప్రస్తుతం 589 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. 312 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 308 టీఎంసీల నీరు ఉంది.
ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 గేట్లు ఎత్తి విడుదల చేయడంతో నాగార్జునసాగర్ కు భారీగా వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు 4 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 4 లక్షల 45 వేల క్యూసెక్కులను దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గత 20 రోజులుగా సాగర్ క్రస్ట్ గేట్లని ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఇన్ ఫ్లోస్ భారీగా వస్తుందని, సాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే రెండోసారి 20 రోజులుగా క్రస్ట్ గేట్లు ఎత్తిన రికార్డు ఉందని అధికారులు చెప్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..