ఆధునిక యుగంలో కథలు చెబుతూ జీవనం సాగిస్తున్న అరుదైన వ్యక్తి..

దొరలకే దొర పిట్టల దొర. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊరు ఊరు తిరుగుతూ పిట్ట కథలు చెప్తాడు. వినే వాడుంటే చాలు గంటలు గంటలు ఊరు వాడల చరిత్రలు కట్టు కథలు అల్లుతాడు. ఎప్పుడో కనుమరుగు అయినా పిట్టల దొరలు ఇప్పటికీ ఆ గ్రామంలో తాత ముత్తాతలు వారసత్వాన్ని వృత్తిగా నమ్ముకుని మాటలు చెబుతూ బ్రతికేస్తున్నాడు. ఎవ్వరూ? ఎక్కడ? అనేది చెప్పనే లేదు కదా..! ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామంలో నాగరాజు అంటే తెలియని వారుండరు.

ఆధునిక యుగంలో కథలు చెబుతూ జీవనం సాగిస్తున్న అరుదైన వ్యక్తి..
Nagaraju

Edited By:

Updated on: Mar 17, 2024 | 12:57 PM

దొరలకే దొర పిట్టల దొర. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఊరు ఊరు తిరుగుతూ పిట్ట కథలు చెప్తాడు. వినే వాడుంటే చాలు గంటలు గంటలు ఊరు వాడల చరిత్రలు కట్టు కథలు అల్లుతాడు. ఎప్పుడో కనుమరుగు అయినా పిట్టల దొరలు ఇప్పటికీ ఆ గ్రామంలో తాత ముత్తాతలు వారసత్వాన్ని వృత్తిగా నమ్ముకుని మాటలు చెబుతూ బ్రతికేస్తున్నాడు.
ఎవ్వరూ? ఎక్కడ? అనేది చెప్పనే లేదు కదా..! ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామంలో నాగరాజు అంటే తెలియని వారుండరు. అదేనండి పిట్టల దొర నాగరాజు అంటే తెలియని వారుండరు. తాత ముత్తాతలు నుంచి వారసత్వంగా తీసుకుని ఊరు వాడల తిరుగుతూ పిట్టల దొర వేషధారణతో అందరినీ ఆకర్షిస్తుంటాడు. కథలు కథలుగా.. ఊరి చరిత్రలు చెపుతూ పిట్ట కథలతో ఆకట్టుకోవడం తనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్యనే పిట్టల దొర అవతారం ఎత్తి నలుగురుని నవ్విస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

తన చిన్న తనం నుండే తండ్రి వృత్తినే దైవంగా భావించి తాను కూడా పిట్టల దొరగా మారాడు. పూర్వకాలం పద్దతులు, సాంప్రదాయాలు, నేటి సమాజానికి అద్దం పట్టేలా కథలు కథలుగా పిట్ట కథలు చెపుతూ అందరి చేత శభాష్ పిట్టల దొర అనిపించుకుంటున్నాడు నాగరాజు. తనకు ముగ్గురు అబ్బాయిలు, ఒక కుమార్తె ఉన్నారు. తన తండ్రి నుంచి వారసత్వంగా నేర్చుకుని వృత్తిగా భావించి స్వీకరించి పిట్టల దొర విద్యతోనే తన కుటుంబాన్ని పెంచి పోషించుకుంటున్నాను అంటూ తన ఆనందాన్ని పంచుకుంటున్నాడు. కాలం మారుతున్న కొద్ది గ్రామీణ కళలు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నేటి సమాజంలో ఇంకా పాత కాలపు కట్టుబాటులు అర్థమయ్యేలా.. ప్రజల్లోకి ఒక పిట్టల దొరగా తన దైన శైలిలో సమాజ సేవ చేస్తూ జీవనం కొనసాగిస్తూన్నాడు ఆ నకిలీ దొర. ఏది ఏమైనా ఈ రోజుల్లో కూడా విచిత్ర వేషధారణతో పిట్టల దొరగా ఊరు వాడ తిరుగుతూ పిట్ట కథలు చెప్పే ఇలాంటి వ్యక్తి ఉండటం ఎంతైనా విశేషమే కదా మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..