Telangana: సర్‌ప్రైజ్.. వైన్ షాప్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే.. అక్కడ ఆయన ఏం చేశారంటే…?
ఆయనో ఎమ్మెల్యే.. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ, అభివృద్ధిపై అధికారులతో హల్ చల్ చేస్తుంటాడు. రాష్ట్రంలో ఆ ఎమ్మెల్యే పేరు తెలియని వారు ఉండరు. అయితే ఆ ఎమ్మెల్యే వైన్ షాప్ లోకి వెళ్లారు. ఆయన అక్కడ మద్యం బాటిళ్ళను పరిశీలించారు. అక్కడున్న వారిని గట్టిగా మందలించారు. ఆ వైన్ షాప్ లోకి ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళాడు ఆయన ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
ఆయనో ఎమ్మెల్యే.. నిత్యం నియోజకవర్గంలో పర్యటిస్తూ, అభివృద్ధిపై అధికారులతో హల్ చల్ చేస్తుంటాడు. రాష్ట్రంలో ఆ ఎమ్మెల్యే పేరు తెలియని వారు ఉండరు. అయితే ఆ ఎమ్మెల్యే వైన్ షాప్ లోకి వెళ్లారు. ఆయన అక్కడ మద్యం బాటిళ్ళను పరిశీలించారు. అక్కడున్న వారిని గట్టిగా మందలించారు. ఆ వైన్ షాప్ లోకి ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళాడు ఆయన ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
రాష్ట్రంలో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వారు లేరు. మునుగోడు నియోజక వర్గాన్ని ఆరోగ్యకర సమాజంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంకల్పించారు. బెల్టు షాపులతో గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకం, లభించడంతో మద్యానికి బానిసలవుతూ అనారోగ్య పాలవుతూ ఆర్థికంగా చితికిపోతున్న ఘటనలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిచి వేసాయి. ఆ ఆవేదనతో మద్యం అమ్మకాలను తగ్గించాలని నిర్ణయించారు. పల్లెల్లో సామాజిక రుగ్మతలు రూపుమాపే ఆరోగ్య వాతావరణం వైపు అడుగులు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహించవద్దంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉద్యమాన్ని చేపట్టారు. గ్రామాల్లోని ప్రతి బూత్ లో మహిళలు, పురుషులతో కలిసి బెల్ట్ షాపుల నిర్మూలన కమిటీలు వేసారు. ఆ కమిటీల ద్వారా గ్రామాలలో బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడి మద్యం అమ్మకాన్ని అరికట్టాలని నిర్దేశించారు. దీంతో బెల్ట్ షాపు నిర్మూలన కమిటీలు గ్రామాలలో మద్యం అమ్మకాన్ని అరికడుతున్నాయి. ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి మాటలను ప్రజలు అర్థం చేసుకున్న నిర్వాహకులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బెల్ట్ షాపులను మూసివేస్తున్నారు. మద్యపాన నిషేధాన్ని పాటించే గ్రామాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నజరానాను కూడా ప్రకటించారు.
తాజాగా ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో పర్యటించారు. మునుగోడు పట్టణంలో వైన్ షాపులను ఎమ్మెల్యే.. ఆకస్మికంగా తనిఖీ చేశారు. నకిలీ మందు అమ్ముతున్నారా అని ఆరా తీసి.. మద్యం బాటిల్స్ ను ఆయన పరిశీలించారు. మద్యం బాటిళ్లపై ఉన్న తయారీ తేదీ, ధరను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్ముతున్నారా అంటూ వైన్ షాప్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వైన్ షాపులకు ఆనుకుని ఉన్న పర్మిట్ రూములను కూడా పరిశీలించారు. అప్పటికే పర్మిట్ రూమ్స్ లో కొందరు మద్యం ప్రియులు మద్యం సేవిస్తున్నారు. అక్కడ మద్యం బాబులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు. ఉదయాన్నే ఇలా తాగుడుకు బానిసైతే కుటుంబ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తూ మద్యంబాబులపై సీరియస్ అయ్యారు. పర్మిట్ రూముల నుండి మద్యం ప్రియులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బయటకు పంపించి వేశాడు. ఉదయం పూట పర్మిట్ రూముల్లోకి అనుమతి ఇవ్వొద్దంటూ వైన్ షాపుల యజమానులకు ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు.
గత పదేళ్లలో మద్యం తాగి చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తే భాదేస్తుందని, చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి కుటుంబ భారాన్ని మోయలేక చాలామంది ఆడపడుచులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు అభివృద్ధి తోపాటు తాగుడు అనే సామాజిక మహమ్మారిని తగ్గించాలనేదే తన ప్రయత్నమని ఆయన చెప్పారు. ఈ ప్రయత్నంలో నాపై వ్యతిరేకత వచ్చినా కూడా వెనక్కి తగ్గనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో తాగుడును తగ్గించేందుకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి..
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి