AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode By Poll 2022 Live: మునుగోడు ఉపఎన్నిక.. ముగిసిన పోలింగ్ సమయం.. పలుచోట్ల కొనసాగుతున్న ఓటింగ్

Munugode By Election Live voting: రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ మొదలైంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు..

Munugode By Poll 2022 Live: మునుగోడు ఉపఎన్నిక.. ముగిసిన పోలింగ్ సమయం.. పలుచోట్ల కొనసాగుతున్న ఓటింగ్
Munugode By Poll 2022 Live
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 03, 2022 | 7:01 PM

Share

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ మొదలైంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం అధికారులు సిద్దమయ్యారు. ఈ మేరకు చండూరులోని డాన్ బాస్కో స్కూల్ లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి సామగ్రి అందించారు. పోలింగ్ తీరుపై మార్గదర్శకాలు, సూచనలు చెప్పారు. అనంతరం వారికి కేటాయించిన ప్రాంతాలకు సిబ్బంది పయనమయ్యారు. కాగా ఈ ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుపు సాధిస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇవాళ( బుధవారం) ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,41,855 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 1,21,720 మంది పురుషులు, 1,20,128 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నిక తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అన్ని పోలింగ్‌ కేంద్రాలకు మొత్తంగా 2,500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటుండగా, అందులో 1,000మంది పోలీసులు ఉన్నారు. అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్స్‌తో పాటు నియోజకవర్గంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్‌ సిబ్బందికి తోడుగా 199 మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారు… ఇవి హై ప్రొఫైల్ ఎలక్షన్ కావడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను పెట్టామని తెలిపారు ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌.. ఇక ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బూత్‌లెవల్‌ ఆఫీసర్లు ఉంటారు.

మునుగోడులోని మొత్తం 298 కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్‭ను కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తోంది ఎన్నికల కమిషన్‌.. ఇందు కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల నుంచి ఫిర్యాదుల కోసం సి-విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారుయ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌. నేరుగా పోలింగ్‌ కేంద్రం నుంచే గంటకోసారి ఓటింగ్‌ శాతం నమోదు చేస్తామన్నారు. ఎన్నికల ఏర్పాట్లను సీఈవో వికాస్‌ రాజ్‌ దగ్గరుంచి పరిశీలిస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతున్న తీరును ఈ లైవ్ వీడియోలో చూడండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Nov 2022 06:21 PM (IST)

    రామిరెడ్డి పల్లి పోలింగ్ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు

    మర్రిగూడ మండలం రామిరెడ్డి పల్లి పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు

    ఒకటే పోలింగ్ బూత్, ఈవీఎం ఉండటంతో పోలింగ్ ఆలస్యం

    క్యూలో ఓటర్లు వేచిఉన్నారు.

    ఆరు గంటల లోపే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో ఉండటంతో ఓటింగ్ కు అనుమతిస్తున్న అధికారులు.

  • 03 Nov 2022 06:12 PM (IST)

    పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న పోలింగ్

    పోలింగ్ సమయం ముగిసినా.. ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉండటంతో.. వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఓటర్లు క్యూలో నిలబడి ఉన్నారు.

  • 03 Nov 2022 06:01 PM (IST)

    ముగిసిన పోలింగ్ సమయం..

    మునుగుడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. చాలా ప్రాంతాల్లో ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. దీంతో ఆయా కేంద్రాల్లో లైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు.

  • 03 Nov 2022 05:48 PM (IST)

    పలుచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు..

    మొరాయిస్తున్న ఈవీఎంలు..

    • సాయంకాలం 6 కావొస్తున్న ముందుకు సాగని పోలింగ్..
    • నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఉదయం నుండి మొరాయిస్తున్న EVM లు..
    • ఓపిక లేక టెంట్ల కింద కుర్చున్న ఓటర్లు..
    • ఎప్పుడు ఓటు వేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూన్న ఓటర్లు..
    • అధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదని విమర్శలు..
  • 03 Nov 2022 05:46 PM (IST)

    సరంపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

    మర్రిగూడ మండలం సరంపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత..

    పోలింగ్ బూత్ ను సందర్శించిన రాజగోపాల్ రెడ్డి

    ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ కార్యకర్తలను రాజగోపాల్ రెడ్డి అనుచరులు దూషించారని ఆందోళన

    టిఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు మధ్య వాగ్వాదం.. తోపులాట..

    ఇరు వర్గాలను చెదర గొట్టిన పోలీసులు..

  • 03 Nov 2022 05:42 PM (IST)

    చివరి గంటలో అనూహ్య పరిణామాలు

    • మునుగోడు పోలింగ్‌లో చివరి గంటలో అనూహ్య పరిణామాలు
    • కొన్ని చోట్ల ఘర్షణ, మరికొన్ని చోట్ల పోలీసుల లాఠీచార్జ్‌
    • చండూరులో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ
    • పోలీసులతో స్థానికులు వాగ్వాదం
  • 03 Nov 2022 05:20 PM (IST)

    సాయంత్రం ఐదు గంటలవరకు 77.55 శాతం ఓటింగ్..

    మునుగోడులో ఉప ఎన్నక ఓటింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. మరికాసేపట్లో ఓటింగ్ ప్రక్రియ ముగయనుంది. సాయంత్రం ఐదు గంటల వరకు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ పర్సంటేజీ 77.55 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 187527 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    నియోజకవర్గంలో మొత్తం 241805 ఓట్లు ఉన్నాయి.

  • 03 Nov 2022 04:40 PM (IST)

    చండూరులో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ

    మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని చోట్ల ఘర్షణ

    చండూరు పట్టణ కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ

    గుంపులు గుంపులుగా ఉన్న వ్యక్తులపై పోలీసుల లాఠీచార్జ్‌

  • 03 Nov 2022 04:39 PM (IST)

    కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు..

    మునుగోడు ఉప ఎన్నిక పొలింగ్.. ముగిసే సమయం దగ్గరపడుతుండటంతో.. కేంద్రాలకు ఓటర్లు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

  • 03 Nov 2022 04:04 PM (IST)

    ఇప్పటివరకు 1,44,878 ఓట్లు పోల్..

    మునుగోడులో మధ్యాహ్నం 3 గంటల వరకు 1,44,878 ఓట్లు పోల్ అయినట్లు అధికారులు తెలిపారు.  ఇప్పటివరకు మొత్తం 59.92 శాతం పోలింగ్ అయింది.

    మునుగోడులో మొత్తం ఓట్లు 2,41,805..

  • 03 Nov 2022 03:50 PM (IST)

    ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్న యువత..

    మునుగోడు ఎన్నికల్లో మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు యంగ్ ఓటర్లు.. అత్యంత కీలకమైన ఈ ఎన్నికలో ఓటేసేందుకు యువ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు.. కొత్తగా ఓటు హక్కు పొందిన యువతి, యువకులు తొలిసారి ఓటేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.. ఇతర వయస్సుల వారితో పోలిస్తే యువకులు ఓటు వేసేందుకు పోటీ పడుతున్నారు.

  • 03 Nov 2022 03:20 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటల వరకు 59.92 శాతం నమోదు..

    మునుగోడులో ఓటింగ్‌ పర్సంటేజీ జోరందుకుంది. మొదట ఉద్రిక్తతలు తలెత్తినా ఇప్పుడు ప్రశాంతంగానే కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ పర్సంటేజీ 59.92 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

  • 03 Nov 2022 03:09 PM (IST)

    ఓటింగ్ బహిష్కరించిన రంగం తండా వాసులు

    చౌటుప్పల్ మండలం రంగం తండా వాసులు ఓటింగ్‌ను బహిష్కరించారు. మొత్తం 350 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామాన్ని పంచాయితీగా మార్చి రోడ్లు వెయ్యాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా.. ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కనీసం ఈ ఎన్నికల్లోనైనా నేతలు స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటేస్తామని స్పష్టం చేస్తున్న రంగం తండా వాసుల డిమాండ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి నారాయణ అందిస్తారు.

  • 03 Nov 2022 03:07 PM (IST)

    ఫిర్యాదు చేసిన ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్

    బీజేపీపై ఎన్నికల ప్రధాన అధికారికి TRS ఫిర్యాదు చేసింది. మద్యం, నగదు పంపిణీ చేస్తోందని కంఫ్లైంట్ ఇచ్చారు..రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు TRS MP బడుగుల లింగయ్య యాదవ్ .

  • 03 Nov 2022 02:52 PM (IST)

    బీజేపీపై ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు..

    బీజేపీపై ఎన్నికల ప్రధాన అధికారికి TRS ఫిర్యాదు చేసింది. బీజేపీ మద్యం, నగదు పంపిణీ చేస్తోందని వెల్లడించింది. ఈ మేరకు వికాస్‌రాజ్‌కు మంత్రి జగదీష్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా.. ధర్నాలు, నిరసనలు చేస్తున్నారని జగదీష్‌రెడ్డి వివరించారు. అధికారులను సైతం బీజేపీ బెదిరిస్తోందని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

  • 03 Nov 2022 02:46 PM (IST)

    పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్న ఓటర్లు..

    పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల పెద్ద పెద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.. ఇదే జోరు కంటిన్యూ అయితే గత రికార్డు బ్రేక్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2018లో ఇక్కడ 91.3 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి జోష్‌ చూస్తుంటే.. 92 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు.

  • 03 Nov 2022 02:22 PM (IST)

    అంతంపేటలో ఓటింగ్ బహిష్కరించిన ఓటర్లు

    గట్టుప్పల్ మండలం అంతంపేటలో ఓటర్లు ఓటింగ్ బహిష్కరించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డబ్బులు పంచుతామని చెప్పి డబ్బులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డబ్బులు తెచ్చుకొని నేతలు ఇంట్లో దాచుకున్నారు. తులం బంగారం, డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదంటూ ఓటర్లు ఆరోపిస్తున్నారు. పక్క గ్రామాల్లో డబ్బులు పంచారు. మేము ఏమి అన్యాయం చేశామంటూ.. దూర ప్రాంతాల నుంచి వచ్చామని.. కానీ ఇవ్వలేదంటూ పేర్కొన్నారు. డబ్బులు పంచితేనే ఓట్లు వేస్తామని ఓటర్లు పేర్కొంటున్నారు.

  • 03 Nov 2022 01:40 PM (IST)

    ఒంటిగంట సమయానికి 41.30 శాతం ఓటింగ్‌ నమోదు..

    మునుగోడులో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.30 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

  • 03 Nov 2022 01:30 PM (IST)

    చండూరులోని పోలింగ్‌ బూత్‌ వద్ద మహిళకు ఊహించని ప్రమాదం..

    చండూరులోని పోలింగ్‌ బూత్‌- 201లో ఓ మహిళ ఊహించని విధంగా ప్రమాదానికి గురైంది. ఓటు వేసేందుకు లోపలికి వెళ్తుండగా గేటు వద్ద ఏర్పాటు చేసిన ఐరన్‌ గ్రిల్‌లో ఆమె కాలు ఇరుక్కుపోయింది. కాలు జారడంతో ఆమె కిందపడిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్లు, పోలీసులు ఆమెకు సాయం చేసి జాగ్రత్తగా తీసుకెళ్లారు.

  • 03 Nov 2022 12:37 PM (IST)

    మర్రిగూడలో లాఠీఛార్జ్‌..

    మునుగోడు బైపోల్‌లో హీట్‌ పీక్‌ స్టేజ్‌కు చేరింది. టైమ్‌ గడుస్తున్న కొద్ది రచ్చ రాజుకుంటోంది. మర్రిగూడలో లాఠీఛార్జ్‌ వరకు వెళ్లింది పరిస్థితి. బయటి ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారంటూ రెండు వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగాయి. సిట్యుయేషన్ సీరియస్‌గా మారడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. రెండు వర్గాలను చెదరగొట్టారు.

  • 03 Nov 2022 12:32 PM (IST)

    “నో మనీ.. నో ఓట్..” పోలింగ్‌నే బహిష్కరించిన అంతపేట గ్రామస్థులు.. ఎందుకంటే..

    మునుగోడు బైపోల్‌లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. నో మనీ.. నో ఓట్ అంటూ ఏకంగా పోలింగ్‌నే బహిష్కరించారు మర్రిగూడ మండలం అంతపేట గ్రామస్థులు. గ్రామంలో కొందరికి మాత్రమే డబ్బులు పంచారని.. మరికొందరికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నగదు ఇస్తే తప్ప పోలింగ్‌ సెంటర్లకు వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు..

  • 03 Nov 2022 11:29 AM (IST)

    దయం 11 నాటికి 25.8 శాతం ఓటింగ్‌

    ఉదయం 9 గంటల వరకు వేగంగా సాగిన ఓటింగ్ సరళి ఆ తర్వాత నెమ్మదించింది. అయితే ఉదయం 11 నాటికి 25.8 శాతం ఓటింగ్‌ నమోదైందని అధికారులు వెల్లడించారు.

  • 03 Nov 2022 11:27 AM (IST)

    ఈవీఎం మిషన్లు మొరాయించడంతో..

    చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు పోలింగ్ నిలిచిపోయింది. ఇక్కడ ఈవీఎం మిషన్లు మొరాయించాయి. దీంతో ఓటు వేసేందుకు వచ్చిన వాళ్లంతా పోలింగ్ సెంటర్లోనే కూర్చుండిపోయారు.

  • 03 Nov 2022 10:56 AM (IST)

    అసలు సీన్ ఇప్పుడే మొదలైంది..

    మునుగోడు బైపోల్‌లో హీట్ కంటిన్యూ అవుతోంది. ఉదయం 9 గంటల వరకు ప్రశాంతంగానే జరిగింది పోలింగ్. అయితే.. ఆ తర్వాతే మొదలైంది అసలు మునుగోడు యుద్ధం. చాలా చోట్ల గొడవలు తలెత్తాయి.. ఔటర్స్‌ ఇంకా నియోజకవర్గంలోనే ఉన్నారని కొన్ని చోట్ల.. డబ్బులు పంచుతున్నారంటూ మరికొన్ని చోట్ల ఘర్షణ తలెత్తింది. ఓటింగ్ రోజు కూడా నగదు ప్రవాహం కంటిన్యూ అవుతోంది. చాలా చోట్ల క్యాష్‌ను సీజ్ చేస్తున్నారు అధికారులు.

  • 03 Nov 2022 10:34 AM (IST)

    పోలీసులను చూసి డబ్బు అక్కడే వదిలి..

    మునుగోడులో మనీ మాయ కొనసాగుతోంది. పోలింగ్‌ రోజూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నేతలు యత్నిస్తున్నారు. చండూరులో కొంతమంది నేతలు ఓటర్లకు నగదు పంచేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులను చూసి డబ్బు అక్కడే వదిలి పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలంలో రూ.2 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

  • 03 Nov 2022 10:33 AM (IST)

    మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షల నగదు పట్టివేత..

    నాంపల్లి మండలం మల్లప్పరాజుపల్లిలో రూ.10 లక్షల నగదు పట్టుబడింది. నగదు తరలిస్తున్న కారును బీజేపీ శ్రేణులు పట్టుకున్నాయి. ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోన్న వేళ ఈ డబ్బు లభ్యం కావడం గమనార్హం.

  • 03 Nov 2022 10:22 AM (IST)

    ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌

    మునుగోడు ఉప ఎన్నికలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ సెంటర్ల వద్ద క్యూ కట్టారు. అయితే ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం పోలింగ్‌ నమోదైంది. సంస్థాన్‌ నారాయణపురం మండలం గుజ్జలో ఈవీఎం మొరాయించింది. ఓటేసేందుకు ఓటర్లు చాలా సెంటర్ ముందు ఓటు వేసేందుకు వేచి చూడాల్సి వచ్చింది.

  • 03 Nov 2022 10:15 AM (IST)

    ఇతర ప్రాంతల నుండి వచ్చి సంస్థాన్ నారాయణపురంలో డబ్బుల పంపిణి..

    పోలింగ్‌ రోజు కూడా భారీగా నగదను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు. సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్‌హాల్‌లో ఇతర ప్రాంతల నుండి వచ్చి డబ్బులు పంచుతుండగా పట్టుకున్నారు. 2లక్షల 99 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

  • 03 Nov 2022 09:43 AM (IST)

    చండూరులో వరంగల్‌కు చెందిన వ్యక్తులు నగదు పంచుతున్నారు- బీజేపీ

    చండూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది..TRS, BJP మధ్య వివాదం తలెత్తింది. డబ్బులు పంచుతున్నారంటూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.. ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. వరంగల్‌కు చెందిన వ్యక్తులు నగదు పంచుతున్నారని BJP ఆరోపించింది..

  • 03 Nov 2022 09:42 AM (IST)

    మునుగోడు ఉప ఎన్నికలో స్పెషల్‌ అట్రాక్షన్‌‌గా కేఏ పాల్‌

    మునుగోడు ఉప ఎన్నికలో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థి కేఏ పాల్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌. ఈయన పోలింగ్‌ కేంద్రాల పరిశీలిస్తున్నారు. ఒక సెంటర్‌ నుంచి మరొకరు సెంటర్‌కు ఆయన పరుగులు పెడుతున్నారు. కారు దిగి రన్‌ చేసుకుంటూ రన్‌ చేస్తున్నారు.

  • 03 Nov 2022 09:21 AM (IST)

    పోలింగ్ సెంటర్ల వద్ద సిద్దిపేటకి చెందిన వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు – బీజేపీ

    మునుగోడు బైపోల్‌లో పలుచోట్ల గొడవలు తలెత్తుతున్నాయి. సిద్దిపేటకి చెందిన వ్యక్తులు ప్రచారం చేస్తున్నారంటూ మర్రిగూడ పోలింగ్ బూత్ బయట బీజేపీ కార్యకర్తల ఆందోళనకు దిగారు. ఔటర్స్ ని ఎందుకు అనుమతి ఇస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. తక్షణమే బయటి వ్యక్తులను పంపించివేయాలని డిమాండ్ చేశారు. అటు TRS శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడంతో టెన్షన్‌ సిట్యుయేషన్ నెలకొంది..

  • 03 Nov 2022 09:21 AM (IST)

    వరంగల్‌కు చెందిన వ్యక్తులు నగదు పంచుతున్నారు – బీజేపీ

    చండూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది..TRS, BJP మధ్య వివాదం తలెత్తింది. డబ్బులు పంచుతున్నారంటూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.. ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ జరిగింది. వరంగల్‌కు చెందిన వ్యక్తులు నగదు పంచుతున్నారని BJP ఆరోపించింది..

  • 03 Nov 2022 09:18 AM (IST)

    సీఎం కేసీఆర్‌ను కలిసానని తన పై వస్తున్న వార్తల పై ఈసీ కి ఫిర్యాదు చేశా..-పాల్వాయి స్రవంతి

    సీఎం కేసీఆర్‌ను కలిసానని తన పై వస్తున్న వార్తల పై ఈసీ కి ఫిర్యాదు చేసిన పాల్వాయి స్రవంతి. ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసారని ఫిర్యాదు లో పేర్కోన్న స్రవంతి. సోషల్ మీడియాలలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరిన పాల్వాయి స్రవంతి.

  • 03 Nov 2022 08:56 AM (IST)

    ఈసీ అధికార పార్టీకి సపోర్ట్ చేస్తోంది – బండి సంజయ్

    మునుగోడు వెళ్లేందుకు ట్రై చేసిన బండి సంజయ్‌ని రాత్రి పోలీసులు అడ్డుకోవడంతో రాత్రంతా హైటెన్షన్‌ నెలకొంది. ఈ నేపథ్యంలోనే EC అధికారులు అధికారపార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆయన విమర్శించారు.

  • 03 Nov 2022 08:35 AM (IST)

    ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు మోడల్ పోలింగ్ స్టేషన్‌.. పోలింగ్‌ కేంద్రాల దగ్గర మహిళలు, వృద్ధులే ఎక్కువగా..

    మునుగోడు బైపోల్‌ సందర్బంగా చండూరు మండలంలోని కోటయ్యగూడెంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. సాధారణంగా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండాలి.. ఓటర్లుగా వారిపై ఉండే బాధ్యలేంటి అనేవి అన్నీ వివరిస్తూ బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఓటర్లు ఎండలో నుంచోవాల్సిన అవసరం లేకుండా కూడా సౌకర్యాలు కల్పించారు. అలాగే ఎవరైనా క్యూలైన్లలో నిలబడం వల్ల అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంటే.. ప్రథమ చికిత్స కోసం మందులు, వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. ఓటర్లలో చైతన్యం కల్పించేందుకు ఈ పోలింగ్ కేంద్రాన్ని అందంగా బెలూన్లతో డెకరేట్ చేశారు.

    ఈ పోలింగ్‌ బూత్‌ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఓటర్లు స్వేచ్చగా ఓటేసేందుకు మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ తయారు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో దివ్యాంగులు, వయో వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కరోనా తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ సెంటర్‌లో తీసుకున్నారు.

  • 03 Nov 2022 08:32 AM (IST)

    12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు..

    మునుగోడు అభ్యర్ది భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఓటర్లు ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ తో పాటు 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేసేందుకు ఈసీ అనుమతించింది.

  • 03 Nov 2022 08:30 AM (IST)

    కనిపించని యువ ఓటర్లు.. పోలింగ్‌ కేంద్రాల దగ్గర మహిళలు, వృద్ధులే ఎక్కువగా..

    మునుగోడు ఉపఎన్నిక కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర మహిళలు, వృద్ధులే ఎక్కువగా కనిపిస్తున్నారు. యువత కొంచెం తక్కువగా పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు. నడవలేనివాళ్లు వీల్‌చైర్లలో, మరికొందరు కర్రల సాయంతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

  • 03 Nov 2022 08:03 AM (IST)

    పనులకు వెళ్లే వారు ఉదయమే వచ్చి ఓటేసి వెళుతున్న ఓటర్లు..

    మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. ముఖ్యంగా గ్రామాల్లో ఉదయమే ఓటర్లు పోలింగ్‌ సెంటర్లకు వచ్చారు. పనులకు వెళ్లే వారు ఉదయమే వచ్చి ఓటేసి వెళుతున్నారు. వృద్ధులు,మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చారు. తొలి గంటలోనే గ్రామాల్లో భారీగా పోలింగ్‌ నమోదైంది.

  • 03 Nov 2022 07:35 AM (IST)

    తంగేడు పల్లి లో గందర గోళం..

    తంగేడు పల్లి లో గందర గోళం నెలకొంది. పోలీసులకు ఓటర్లకు వాగ్వాదం నెలకొంది.

  • 03 Nov 2022 07:33 AM (IST)

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను భారీ భద్రత మధ్య..

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ నుంచి భారీ భద్రత మధ్య బిజెపి పార్టీ కార్యాలయానికి తరలిస్తున్న పోలీసులు.

  • 03 Nov 2022 07:28 AM (IST)

    మునుగోడు సహా దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు

    మునుగోడు సహా దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలకు ఈరోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ నెలకొంది.  

  • 03 Nov 2022 07:23 AM (IST)

    పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌తోపాటు ముగ్గురు పోలింగ్‌ అధికారులు

    రాష్ట్రం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే జనం పోలింగ్‌ కేంద్రంలో ఉత్సాహంగా తరలివస్తున్నారు. పోలింగ్‌ ఏర్పాట్లును ఎలక్షన్‌ కమిషన్‌ ఇప్పటికే పకడ్బందీగా పూర్తి చేసింది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌తోపాటు ముగ్గురు పోలింగ్‌ అధికారులను విధుల్లో ఉంచింది.

  • 03 Nov 2022 07:21 AM (IST)

    పోలింగ్ సెంటర్లలోకి స్మార్ట్ ఫోన్లకు అనుమతి లేదు..

    పోలింగ్ సెంటర్లలోకి స్మార్ట్ ఫోన్లకు అనుమతి ఇవ్వడం లేదు పోలింగ్ అధికారులు. పోలింగ్ సెంటర్లకు ముందే ఫోన్లతో వచ్చినవారిని నిలివేస్తున్నారు. పోలీంగ్ స్లిప్పులు, ఐడీ కార్డులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు.

  • 03 Nov 2022 07:12 AM (IST)

    మొత్తం 298 పోలింగ్​ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

    ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ సజావుగా జరిగేలా పకడ్బంధీ చర్యలు తీసుకున్నారు. మొత్తం 298 పోలింగ్​ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాల నిఘాలో ఉప పోలింగ్‌ జరుగుతోంది.

  • 03 Nov 2022 07:11 AM (IST)

    మొదలైన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌.. సాయంత్రం 6 గంటల వరకు..

    రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్ సజావుగా జరిగేలా పకడ్బంధీ చర్యలు తీసుకున్నారు. మొత్తం 298 పోలింగ్​ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తో పాటు 15 కంపెనీల కేంద్ర బలగాల నిఘాలో ఉప పోలింగ్‌ జరుగుతోంది.

  • 03 Nov 2022 07:07 AM (IST)

    మునుగోడులో భారీగా కొత్తకోడళ్లు..

    మునుగోడు ఉప ఎన్నికలో ప్రతి అంశమూ సెన్సేషన్‌గా మారుతోంది. ప్రత్యేకించి కొత్త ఓటర్లు ఎవరికి మద్దతిస్తారనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో ప్రత్యేకించి కొత్తకోడళ్లు భారీసంఖ్యలో ఉండడంతో అభ్యర్థులు వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే నానాపాట్లు పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మునుగోడు ఉప ఎన్నికలో కొత్త ఓటర్ల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. జస్ట్‌ రెండునెలల్లో 24వేలకు మించి ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులపై పార్టీల మధ్య రగడ, కోర్టు తీర్పుల అనంతరం.. మొత్తం 2 లక్షల 41 వేలపై చిలుకు ఓట్లలో 14వేల మంది కొత్త ఓటర్లను ఫైనల్‌ చేసింది ఈసీ.

  • 03 Nov 2022 06:57 AM (IST)

    బీసీ ఓటర్ల సంఖ్య భారీగా ఉండడంతో.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం..

    మూడు ప్రధాన పార్టీలతో పాటు బీఎస్పీ తరఫున అందోజు శంకరాచారి, టీజేఎస్‌ నుంచి పల్లె వినయ్‌కుమార్‌, ప్రజాశాంతిపార్టీ నుంచి కేఏపాల్‌ బరిలో ఉన్నారు. ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. నియోజకవర్గంలో బీసీ ఓటర్ల సంఖ్య భారీగా ఉండడంతో బీఎస్పీ అభ్యర్థి సైతం గెలుపుపై ఆశలు పెంచుకున్నారు. ఇక మిగతా అభ్యర్థులంతా నామమాత్రంగానే పోటీలో నిలిచినట్లు స్పష్టమవుతోంది.

  • 03 Nov 2022 06:56 AM (IST)

    మునుగోడులో గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది అధికార టీఆర్‌ఎస్‌..

    హుజూరాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమితో కసితో ఉన్న అధికార టీఆర్‌ఎస్‌.. మునుగోడులో గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఉప ఎన్నికలో గెలిచి.. సత్తాను చాటేందుకు శాయశక్తులా పనిచేస్తోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా అభ్యర్థిని ఎంపిక చేసింది. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి గతంలోనూ మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ సారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది అధికార పార్టీ. వామపక్షాలు సైతం టీఆర్‌ఎస్‌కు అండగా నిలవడంతో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమంటున్నాయి ఆ పార్టీ శ్రేణులు.

  • 03 Nov 2022 06:55 AM (IST)

    ఎలాగైనా గెలిచి పట్టు నిలుపుకోవాలని..

    టీఆర్‌ఎస్‌ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి బరిలో నిలిచారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో సిట్టింగ్‌ స్థానాన్ని గెలుచుకునేందుకు కాంగ్రెస్‌ తన శక్తినంతా ధారబోస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తెగా రంగంలోకి దిగిన పాల్వాయి స్రవంతి గెలుపుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. తన రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి పట్టు నిలుపుకోవాలని చూస్తున్నారు రాజగోపాల్‌రెడ్డి. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజగోపాల్‌రెడ్డికి ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగానూ పనిచేసిన అనుభవం ఉంది. మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాజగోపాల్‌రెడ్డి తన పరువు నిలుపుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

  • 03 Nov 2022 06:54 AM (IST)

    బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నా.. ప్రధాన పోటీమాత్రం మూడు పార్టీల మధ్యే..

    మునుగోడు ఉప ఎన్నిక ప్రధాన పార్టీల అభ్యర్థులకు లైఫ్‌అండ్‌ డెత్‌గా మారింది. మరికాసేపట్లో పోలింగ్‌ ప్రారంభం కానుండడంతో ఆ టెన్షన్‌ మరింత పెరిగింది. బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నా.. ప్రధాన పోటీమాత్రం మూడు పార్టీల మధ్యే జరుగనుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నడుమ హోరాహోరీగా సాగనున్న పోరుకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. కాసేపట్లో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తనుండడంతో పోలింగ్‌ సరళిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.

  • 03 Nov 2022 06:54 AM (IST)

    మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాల్లో 105 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలు

    మునుగోడు ఉప ఎన్నికలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు సీపీ మహేశ్‌ భగవత్‌. ప్రతి పోలింగ్‌ కేంద్రం దగ్గర కేంద్ర బలగాలను మోహరించామన్నారు. ఎలాంటి గొడవలకు చోటివ్వకుండా పకడ్బందీగా భద్రత కల్పించినట్లు చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాల్లో 105 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు చెప్పారు. మరో 35 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు సీపీ.

  • 03 Nov 2022 06:53 AM (IST)

    మునుగోడు ఉప ఎన్నికలో తొలిసారి కంట్రోల్‌ రూం ఏర్పాటు..

    మునుగోడు ఉప ఎన్నికలో తొలిసారి కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నామన్నారు ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌. ఎక్కడ ఏ చిన్నపొరబాటు జరిగినా ఇట్టే పట్టేస్తామని చెప్పారు. హై ప్రొఫైల్‌ ఎన్నిక కావడంతో భద్రతపై స్పెషల్‌ ఫోకస్ చేసింది ఈసీ. ఎన్నికల విధుల్లో మొత్తం 3,366 మంది పోలీసులు, 15 కంపెనీలకు చెందిన కేంద్రబలగాలను మోహరించింది. డబ్బు, మద్యం తరలించకుండా 100 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది.

  • 03 Nov 2022 06:52 AM (IST)

    దివ్యాంగులు 5,686 మంది..

    మునుగోడు నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓట్లలో 50 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.. ఓటర్ల జాబితాలో దివ్యాంగులు 5,686 మంది ఉన్నారు.. సర్వీసు ఓటర్లతో పాటు 80 ఏళ్లు పైబడినవారికి, దివ్యాంగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. 798 మంది ఈ సదుపాయాన్ని ఎంచుకోగా.. అందులో 685 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం మీద గమనిస్తే ఈసీ అవకాశం కల్పించినా వృద్దులు, దివ్యాంగులు పెద్దగా పోస్టల్‌ బ్యాలట్‌ సదుపాయాన్ని ఉపయోగించుకోలేకపోయాయి..

  • 03 Nov 2022 06:51 AM (IST)

    ఆధార్‌ కార్డు డిజిటల్‌ కార్డుకన్నా..కాస్తా పెద్దసైజులో ఉంటుంది..

    ఆధార్‌ కార్డు డిజిటల్‌ కార్డుకన్నా..కాస్తా పెద్దసైజులో ఉంటుంది.. కార్డు మీద ఓటరు ఫొటో, పేర్లు, అడ్రస్‌ ఎంతో క్లారిటీతో కనిపిస్తాయని తెలిపారు సీఈవో వికాస్‌రాజ్‌. ఇందులో క్యూఆర్‌ కోడ్‌, చిప్‌ కూడా ఉంటుంది. ఈ ఓటర్‌ కార్డులను మొదటిసారి అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు

  • 03 Nov 2022 06:51 AM (IST)

    ఓటర్ కార్డులను ఆన్ లైన్ లోనూ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం..

    మునుగోడు బైపోల్‌ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ అన్ని చర్యలు తీసుకుంది. ఓటర్ స్లిప్పుల పంపిణీ ఇప్పటికే పూర్తైంది. అందని వారు ఆన్ లైన్ లోనూ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక మునుగోడు ఎన్నికల కోసం దేశంలోనే మొదటిసారి న్యూ డిజిటల్‌ ఓటర్‌ ఐడెంటీ కార్డులను పంపిణీ చేసింది ఈసీ.

  • 03 Nov 2022 06:42 AM (IST)

    నియోజకవర్గంలో మూడంచెల భద్రత ఏర్పాట్లు..

    అన్ని పోలింగ్‌ కేంద్రాలకు మొత్తంగా 2,500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటుండగా, అందులో 1,000మంది పోలీసులు ఉన్నారు. అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్స్‌తో పాటు నియోజకవర్గంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్‌ సిబ్బందికి తోడుగా 199 మంది మైక్రో అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారు… ఇవి హై ప్రొఫైల్ ఎలక్షన్ కావడంతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను పెట్టామని తెలిపారు ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌.. ఇక ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బూత్‌లెవల్‌ ఆఫీసర్లు తెలిపారు..

  • 03 Nov 2022 06:36 AM (IST)

    పోలింగ్‌ స్టాఫ్‌ను కూడా కాస్త భారీగానే ఏర్పాటు..

    మనుగోడు ఉప ఎన్నికకు పోలింగ్‌ స్టాఫ్‌ను కూడా కాస్త భారీగానే ఏర్పాటు చేశారు.. సాధారణంగా రిజర్వ్‌ పోలీసులను చూస్తుంటాం.. మునుగోడులో రిజర్వు పోలింగ్‌ సిబ్బందిని కూడా రంగంలోకి దింపారు.. ఎలాంటి సమస్య వచ్చిన తక్షణం స్పందించేలా ఏర్పాట్లు చేశారు.. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ముగ్గురు ఇతర ఆఫీసర్లు ఉంటారు. 298 పోలింగ్‌ స్టేషన్లకు గానూ మొత్తం 1,192 మంది సిబ్బంది అవసరం.. అయితే ఈసీ అధికారులు 300 మంది సిబ్బందిని అదనంగా ఏర్పాటు చేశారు..

Published On - Nov 03,2022 6:34 AM