MLA Seethakka: నేనెప్పుడూ నక్సలైట్‌ అవుతాననుకోలేదు.. పీహెచ్‌డీ పట్టా పొందిన ఎమ్మెల్యే సీతక్క భావోద్వేగం

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గొత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో ఆమె రీసెర్చి పూర్తి చేశారు. సీతక్క సమర్పించిన థీసీస్‌ను పరిశీలించిన అధికారులు ఆమెకు పీహెచ్‌డీ ఇస్తున్నట్లు ప్రకటించారు.

MLA Seethakka: నేనెప్పుడూ నక్సలైట్‌ అవుతాననుకోలేదు.. పీహెచ్‌డీ పట్టా పొందిన ఎమ్మెల్యే సీతక్క భావోద్వేగం
Mla Seethakka

Updated on: Oct 11, 2022 | 3:34 PM

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సాధించారు. ఓయూ మాజీ ఛాన్సలర్, మణిపూర్ సెంట్రల్ వర్సిటీ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ తిరుపతిరావు పర్యవేక్షణలో.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గొత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో ఆమె రీసెర్చి పూర్తి చేశారు. సీతక్క సమర్పించిన థీసీస్‌ను పరిశీలించిన అధికారులు ఆమెకు పీహెచ్‌డీ ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా తన రీసెర్చిలో సహకరించిన ప్రొఫెసర్లు ముసలయ్య, అశోక్‌ నాయుడు, చంద్రునాయక్‌లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.  దీని గురించి సోషల్‌ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నారు సీతక్క. ‘నా చిన్నతనంలో నేనెప్పుడూ నక్సలైట్ అవుతానని అనుకోలేదు. నక్సలైట్‌గా ఉన్నప్పుడు లాయర్ అవుతానని అనుకోలేదు. ఇక లాయర్‌గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవుతానని కూడా అనుకోలేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పీహెచ్‌డీ చేస్తానని అనుకోలేదు. ఇప్పుడు మీరు నన్ను డాక్టర్ అనుసూయ సీతక్క పీహెచ్‌డీ అని పిలవచ్చు’ అని తన ఆనందానికి అక్షరరూపమిచ్చారు.

నా చివరి శ్వాస వరకు ఆపను..

ఇక మరో పోస్టులో ‘ప్రజలకు సేవ చేయడం, జ్ఞానాన్ని పొందడం నా అలవాటు. నా చివరి శ్వాస వరకు నేను దీన్ని ఎప్పటికీ ఆపను. నా పీహెచ్‌డీ గైడ్ ప్రొఫెసర్ టి.తిరుపతి రావు సార్ మాజీ వీసీ ఉస్మానియా విశ్వవిద్యాలయం, ప్రస్తుత మణిపూర్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్, హెచ్‌ఓడీ ప్రొఫెసర్ ముసలయ్య , ప్రొఫెసర్ అశోక్ నాయుడు, ప్రొఫెసర్ చంద్రు నాయక్ .. ఇలా పొలిటికల్ సైన్స్‌లో నా పీహెచ్‌డీ టాపిక్‌ను పూర్తి చేయడానికి నా పక్షాన నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని తెలిపారు సీతక్క.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఏడాది జులైలోనే ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు సీతక్క. ఆ సందర్భంలో విద్యార్థి జీవితమే ఉత్తమంగా ఉందంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. చిన్నతనంలోనే అడవి బాట పట్టి నక్సలైట్‌గా మారిపోయారు సీతక్క. ఆ తర్వాత జన జీనవ స్రవంతిలోకి వచ్చి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజల అభిమానంతో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఆమె ఉంటారు. ముఖ్యంగా కరోనా సమయంలో కొండలు, గుట్టలు, వాగులు, వంకలు తిరుగుతూ ఆపదలో ఉన్న ప్రజలకు ‘ నేనున్నా’ అంటూ భరోసా ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..