Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్‌.. పార్టీని వీడనున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఏ పార్టీలోకి వెళ్లనున్నారంటే..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మరికాసేపట్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు కోమటిరెడ్డి. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్‌షాక్‌.. పార్టీని వీడనున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఏ పార్టీలోకి వెళ్లనున్నారంటే..
Komatireddy Venkat Reddy
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 06, 2023 | 9:23 AM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మరికాసేపట్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించుకున్నారు కోమటిరెడ్డి. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణ ఏర్పాటు తరువాత పార్టీ పీసీసీ చీఫ్‌, ఏఐసీసీ పదవులు ఆశించారు. కానీ, ఆయనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. అయితే, ఎప్పటికప్పుడు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఇక ఆయన తమ్ముడుు రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడినప్పుడు కాంగ్రెస్‌ నేతలతో మరింత దూరం పెరిగింది. ఆ తరువాత పార్టీ అధిష్టానంతో మాట్లాడి కాస్త చల్లబడ్డారు ఎంపీ కోమటిరెడ్డి. అయినప్పటికీ నాటి నుంచి నేటి వరకు పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన ఆయన.. ఫైనల్‌గా పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు.

సంచలన నిర్ణయం..

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, ఆయన అనుచరులు మరో మాట చెప్తున్నారు. కొత్త పార్టీ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పేరుతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కొత్త పార్టీని స్థాపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే, మరోవైపు ఆయన బీజేపీలోకే వెళ్తారని మరికొందరు శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తో అనేక సార్లు భేటీ అయ్యారు వెంకట్ రెడ్డి. పార్టీలోక వస్తే ప్రాధాన్యత ఇస్తామని బీజేపీ అధిష్టానం కూడా భారీగానే ఆఫర్లు ఇచ్చిందని టాక్. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఎంపీ కోమటిరెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామాకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కింద చూడొచ్చు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..