Viral: మీరేనా..? నేనూ తాగుతా మందు.. నోటికాడ మద్యాన్ని లాక్కెళ్లిన కోతి.. ఆ తర్వాత కిక్కే కిక్కు..
Monkey gets drunk: మందు బాబులం.. మేము మందు బాబులం.. అనేది మనుషులకేనా..! మేము మందు కొడతాం. మాకేం తక్కువా.. అంటూ ఒక వానరం హడావుడిగా.. బెల్ట్ షాప్‌కు వెళ్ళింది.

Monkey gets drunk: మందు బాబులం.. మేము మందు బాబులం.. అనేది మనుషులకేనా..! మేము మందు కొడతాం. మాకేం తక్కువా.. అంటూ ఒక వానరం హడావుడిగా.. బెల్ట్ షాప్‌కు వెళ్ళింది. డబ్బులు లేకుండానే చక్కగా 90 ml దొరికింది. అంతే టక్కున చేతికి అందుకొని.. చక చక.. చెట్టెక్కి కూర్చుని.. హాయ్ గా 90 ml మందు లాగించేసింది.. ఈ షాకింగ్ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకా సాగర్ క్రాస్ రోడ్ వద్ద ఒక బెల్ట్ షాపు దగ్గర చోటుచేసుకుంది. మధ్యాహ్నం లంచ్ టైమ్ కావడంతో బెల్ట్ షాపు యజమాని షాపు బంద్ చేసి భోజనానికి ఇంటికి వెళ్ళాడు. బయట నుంచి మందు తెచ్చుకున్న కొందరు యువకులు బెల్ట్ షాపు వెనుక బల్లాలపై కూర్చుని మందు తాగుతున్నారు.
ఈ క్రమంలో చెట్టు మీద కూర్చుని గమనించిన కోతి.. హఠాత్తుగా అక్కడకు వచ్చి యువకుడు తాగే మందు గ్లాస్ ను గుంజుకుని పరుగు పరుగున చెట్టు ఎక్కి కూర్చుంది. డబ్బులు పెట్టి కొనకుండ వచ్చిన మందు కదా.. ఒక సిప్ వేద్దామని వేసింది. టేస్ట్ బాగా నచ్చింది అనుకుంటా.. పక్కనున్న మరో కోతికి కూడా అందకుండా మొత్తం లాగించేసింది. ఆ తర్వాత మత్తులో అటూఇటూ తూలుతూ.. ఎంజాయ్ చేసింది.
సరదాగా మందు తాగుదామని కూర్చుంటే.. ఈ కోతులు ఎక్కడ దొరికాయి రా.. బాబు. మా నోటి కాడ మందు లాగేసుకున్నాయి అని యువకులు నవ్వుకుంటూ వెనుదిరిగారు.. ఈ సీన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.




వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..