AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్.. ఈ విషయాలు తెలుసుకోండి

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అధికారికంగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నిన్నటి వరకు ఓ లెక్క.. ఇక మీదట మరోలెక్క. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో కోడ్‌ కొరడాను కఠినంగా అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ప్రకటించారు. నిబంధనలను పూర్తిగా అర్థం చేసుకొని వ్యవహరించాలని రాజకీయ పార్టీలను CEO కోరారు.

రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్.. ఈ విషయాలు తెలుసుకోండి
Vikas Raj
Ram Naramaneni
|

Updated on: Oct 09, 2023 | 9:24 PM

Share

తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ వెంటనే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వపరంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎటువంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ వెబ్‌సైట్లలో మంత్రుల ఫొటోలు తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ను అర్థం చేసుకోవాలని CEO వికాస్‌ రాజ్‌ రాజకీయ పార్టీలను కోరారు. సంక్షేమ పథకాల అమల్లో గతంలో ఉన్న నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలు తమ ప్రకటనలకు సంబంధించి ముందుగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాలి CEO సూచించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్లపై నిషేధం ఉంటుందని తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకెళ్లే వారు వాటికి సంబంధించిన పత్రాలను కచ్చితంగా చూపాలని అన్నారు. డ్రగ్స్‌, మద్యం, నగదు తరలింపుపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల సౌకర్యార్థం ఈసారి EVMలపై పార్టీ గుర్తులతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఫొటో కూడా ఉంటుందని చెప్పారు. పోలింగ్ రోజున వికలాంగులు (పిడబ్ల్యుడి), సీనియర్ సిటిజన్‌లకు పోలింగ్ బూత్‌లకు రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఈ ఎన్నికల్లో తొలిసారిగా సీనియర్ సిటిజన్లు, పిడబ్ల్యుడి ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు.

గరిష్టంగా ఒక పోలింగ్‌ స్టేషన్‌లో 1500 మంది ఓటర్లు ఉండేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. దీని కోసం పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను కూడా పెంచుతున్నట్టు తెలిపింది. 2018 ఎన్నికల్లో తెలంగాణలో 32,812 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా ఈసారి ఆ సంఖ్య 35,356కు పెరగనుంది.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటే చాలా నియమనిబంధనలు ఉంటాయి. ప్రభుత్వం ఏం చేయాలి? ఏం చేయకూడదు…అనేవాటిపై సవాలక్ష నిబంధనలుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

  •  అధికారిక పనులకు తప్ప ఇతర పనులకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడకూడదు
  •  అధికార పర్యటనలు, పార్టీ ప్రచార పర్యటనలు కలిపి నిర్వహింకూడదు
  • పార్టీ పరమైన అంశాలకు ప్రభుత్వ వాహనాలు ఉపయోగించకూడదు
  • కాన్వాయ్‌లో 3కంటే ఎక్కువ వాహనాలు ఉంటే ఎన్నికల వ్యయం కింద చూపించాలి
  •  ఈ రోజు నుంచే ఎన్నికల జమ ఖర్చులు కూడా అమల్లోకి!
  • అన్ని పార్టీలకూ అందుబాటులో వసతి గృహాలు, సభాస్థలాలు, హెలిప్యాడ్‌లు
  •  ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల యాడ్స్‌ నిషేధం
  • ప్రభుత్వపరంగా ఇవ్వాల్సి వస్తే ఈసీ అనుమతి తప్పనిసరి
  •  ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్లు, చెల్లింపులకు నో
  •  కొత్త పథకాల ప్రకటన పూర్తిగా నిషేధం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..