Raja Singh: ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మీరే తీసుకోండి.. ఇంటెలిజెన్స్‌ ఐజీకి రాజాసింగ్‌ లేఖ..

తెలంగాణ ఇంటెలిజెన్స్‌ అధికారులు తనకు ఏర్పాటు చేసిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనికిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని..

Raja Singh: ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మీరే తీసుకోండి.. ఇంటెలిజెన్స్‌ ఐజీకి రాజాసింగ్‌ లేఖ..
Mla Raja Singh
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 17, 2022 | 12:30 PM

తెలంగాణ ఇంటెలిజెన్స్‌ అధికారులు తనకు ఏర్పాటు చేసిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనికిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందంటూ ఇటీవల రాజాసింగ్ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజాసింగ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై గురువారం తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. ‘‘నాకు కేటాయించిన వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందంటూ పలుమార్లు పోలీసు శాఖ దృష్టికి తీసుకొచ్చినా.. తిరిగి అదే వాహనాన్ని కేటాయిస్తున్నారు. 2010 మోడల్‌కు చెందిన వాహనంలో అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్గం మధ్యలోనే నిలిచిపోతోంది.. ఇటీవల కొంత మంది ఎమ్మెల్యేలకు నూతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారు. ఆ జాబితాలో నా పేరు లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది’’ అంటూ రాజాసింగ్ పేర్కొన్నారు.

తీవ్రవాదుల నుంచి తనకు ప్రాణహాని ఉన్న విషయం పోలీసులకు తెలుసని.. అయినా తన భద్రత విషయంలో అలసత్వం వహిస్తున్నారంటూ వివరించారు. దీని వల్ల ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులు తనపై దాడి చేసేలా అవకాశం కల్పిస్తున్నారన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం మార్చలేకపోతే.. తనకు కేటాయించిన వాహనాన్ని తిరిగి తీసుకోండి. పాత వాహనాన్ని వినియోగించలేను.. అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖలో పేర్కొన్నారు.

పీడీ యాక్ట్ కేసులో ఇటీవలనే జైలు నుంచి విడుదలైన రాజాసింగ్.. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ ఆగిపోతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం అఫ్జల్ గంజ్ మీదుగా బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తుండగా.. మధ్యలో మొరాయించడంతో ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోవడంతో అక్కడి నుంచి మరో వాహనంలో ఇంటికి చేరుకున్నానని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇలా తరచూ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోతుండటంతో తెలంగాణ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపించాననని.. వాళ్లు మరమ్మతులు చేసి తిరిగి అదే వాహనాన్ని ఇచ్చారంటూ రాజాసింగ్ వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!