ఇటీవల బీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో ఐటీ దాడులు జరిగాయన్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరు మీద సౌత్ ఆఫ్రికాలో గనులున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అందంతా అవాస్తవం అని తెలిపారు. వేరే ఉద్దేశంతోనే ఐటీ దాడులు నిర్వహించి.. తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తన ఇల్లు, కార్యాలయాల్లో మూడు రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయన్నారు. తనిఖీల్లో భాగంగా అధికారులకు అన్నివిధాలుగా సహకరించానని చెప్పారు.
తన బంధువుల ఇళ్లలో పలు కీలక డ్యాకుమెంట్లు స్వాధీనం చేసుకున్నారనే ప్రచారాన్ని కూడా కొట్టిపారేశారు. అయితే శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు పూర్తైన అనంతరం తొలిసారిగా ఆయన భువనగిరికి వచ్చారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. మిల్క్ చిల్లింగ్ సెంటర్ నుంచి కార్యాలయం దాకా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రంలో మున్సిపల్ ఛైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..