Miss World 2025: చార్మినార్ వద్ద అందాల సుందరీమణులు హెరిటేజ్ వాక్.. చార్మినార్‌ పరిధి ట్రాఫిక్‌ మళ్లింపు

హైదరాబాద్‌ వేదికగా మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలు ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల ప్రపంచ సుందరీమణులు విచ్చేశారు. ఇప్పుడు తెలంగాణలో సందడి చేస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌ చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్‌ చేసేందుకు రెడీ అయ్యారు

Miss World 2025: చార్మినార్ వద్ద అందాల సుందరీమణులు హెరిటేజ్ వాక్.. చార్మినార్‌ పరిధి ట్రాఫిక్‌ మళ్లింపు
Miss World 2025

Updated on: May 13, 2025 | 10:33 AM

హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ 2025 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరికొన్ని రోజుల పాటు జరగనుండగా… రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చేస్తున్నారు ఈ వరల్డ్‌ బ్యూటీస్‌. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో భాగంగా అందగత్తెల హడావుడి పెరిగింది. నిన్న నాగార్జునసాగర్‌ బుద్ధవనంలో సందడి చేసిన సుందరీమణులు ఇవాళ హైదరాబాద్‌ చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్‌ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ వాక్‌లో 109 దేశాల మిస్‌ వరల్డ్‌ పోటీదారులు పాల్గొంటారు. నిజాం సంప్రదాయ వస్త్రధారణలో అలరిస్తారు. అనంతరం నిజాం రాజులు వాడిన వస్తువుల ప్రదర్శన ఉంటుంది.

లాడ్‌ బజార్‌ ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుస్తోంది. దీనంతటికీ కారణం ఇక్కడికి మిస్ వరల్డ్ సుందరీమణులు రానుండటమే. సాయంత్రం.. లాడ్‌ బజార్‌ దగ్గర జరిగే హెరిటేజ్ వాక్‌లో పాల్గొనున్న వరల్డ్ బ్యూటీస్‌.. ఆ తర్వాత బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కన్హయ్యలాల్, మోతిలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, కెఆర్ కాసత్, జాజు పెరల్స్ ఏహెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే దుకాణాల్లో షాపింగ్ చేస్తారు. చౌమహల్లా ప్యాలెస్‌లో ప్రభుత్వం ఇచ్చే వెల్కమ్ డిన్నర్‌ను ఆస్వాదించనున్నారు.

ఇవి కూడా చదవండి

హెరిటేజ్ వాక్ నేపథ్యంలో పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు పోలీసులు. మదీనా నుంచి చార్మినార్, చార్మినార్ నుంచి శాలిబండ వెళ్లే మార్గాలను మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు విధించారు. ఇప్పటికే చార్మినార్ పరిసర ప్రాంతాలను బాంబు, డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు నిర్వహించారు పోలీసులు.

మిస్‌ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణకు తరలివచ్చిన ప్రపంచస్థాయి కంటెస్టెంట్స్ రేపు.. వరల్డ్‌ హెరిటేజ్‌ కట్టడం రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. సుందరీమణుల రాక కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టింది. రామప్ప దేవాలయాన్ని సర్వాంగ సుందర్భంగా ముస్తాబు చేయించిన అధికారులు.. అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..