Hyderabad: ఫిల్మ్‌నగర్‌లో ఓ మహిళ, ఇద్దరు వ్యక్తులు.. మైనర్ బాలికను ఇంటికి తీసుకొచ్చి.. ఆపై.!
సినిమాల్లో అవకాశాల పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడో అసిస్టెంట్ డైరెక్టర్... అతడితో పాటు కెమెరామెన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు . ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి మరి. ఓ లుక్కేయండి ఇక్కడ. ఎక్కడ జరిగిందో..?

ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. సినీ అవకాశాల పేరుతో మైనర్ బాలికను వలలో వేసి అత్యాచారం చేసిన కేసును పోలీసులు బట్టబయలు చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి, కెమెరామెన్ అనిల్, అలాగే ఈ బాలికను అవకాశాలు కల్పిస్తామని ఆకట్టుకుని తీసుకెళ్లిన మహిళ అరుణ — ఈ ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. సినిమాల్లో నటించాలనే కలతో ఉన్న బాధిత బాలికను ప్రలోభపెట్టి, షూటింగ్‌కు సంబంధించిన పనులు చూపిస్తామంటూ అరుణ ముందుగా తన ఇంటికి తీసుకెళ్లి, అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డితో కలిపినట్టు పోలీసులు తెలిపారు.
ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని శివారెడ్డి, కెమెరామెన్ అనిల్ కలిసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు విచారణలో బయటపడింది. ఘటన బయటపడిన వెంటనే బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ఫిల్మ్‌నగర్ పోలీసులు వేగంగా స్పందించి ముగ్గురినీ అరెస్ట్ చేశారు. సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో మైనర్లను మోసగిస్తారని.. ఎవరూ నమ్మొద్దని, ఇటువంటి మోసపూరిత పద్ధతులు ఎక్కువవుతున్నందున తల్లిదండ్రులు, యువతరం జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సినిమాల్లో చేసే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత ఇళ్లలో, ప్రైవేట్ స్థలాల్లో ఇవ్వరని… ఎవరు ఇటువంటి ప్రలోభాలు చూపినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
