Telangana: ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురు.. ఎంత కొట్టినా తలుపు తీయలేదు.. అనుమానమొచ్చి లోపలికి తొంగి చూడగా
కుకునూరుపల్లి గ్రామానికి చెందిన ఆశని శంకర్ మేస్త్రీగా పనిచేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు..శంకర్ కు ఒక కుమారుడు, కుమార్తె ఆశని శ్రావణి(18) ఉన్నారు.శ్రావణి ఇంటర్ పూర్తిచేసి ఇంటి దగ్గరే ఉంటూ కూలీ పనులకు వెళ్తుంది. శంకర్ తన కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్య,కుటుంబ సమస్యలు ఉండటంతో..

ఇటీవల ప్రేమ జంటల ఆత్మహత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. టీనేజ్ ప్రేమలను పెద్దలు ఒప్పుకోకపోవడమో.. పెళ్లికి నిరాకరించడమో.. కారణమేదైనా ఒకరిని విడిచి మరొకరు ఉండలేక రెండు పదుల వయస్సు దాటకుండానే దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిలువునా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో ప్రియుడు అనారోగ్యంతో చనిపోగా నువ్వులేని జీవితం నాకు వద్దు అని ఓ ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా కుకునూ రుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే కుకునూరుపల్లి గ్రామానికి చెందిన ఆశని శంకర్ మేస్త్రీగా పనిచేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు..శంకర్ కు ఒక కుమారుడు, కుమార్తె ఆశని శ్రావణి(18) ఉన్నారు.శ్రావణి ఇంటర్ పూర్తిచేసి ఇంటి దగ్గరే ఉంటూ కూలీ పనులకు వెళ్తుంది. శంకర్ తన కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్య,కుటుంబ సమస్యలు ఉండటంతో దౌల్తాబాద్ మండలం మల్లేశం పల్లికి చెందిన కుమ్మరి మహేష్ అలియాస్ రహీమ్ బాబా వద్దకు వెళ్లేవారు. ఈ క్రమంలో శ్రావణికి అక్కడ మహేష్‌తో పరిచయం ఏర్పడి ఆది ప్రేమగా మారింది. ఇటీవల నాలుగు రోజుల క్రితం మహేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో శ్రావణి సరిగ్గా ఇంట్లో తినకపోవడాన్ని గమనించిన కుటుంబసభ్యులు శ్రావణిని అడగగా మహేష్‌ని ప్రేమించానని.. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని తెలిపింది. అంతలోనే మహేష్ మృతి చెందాడని మనస్థాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రావణి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే శ్రావణి మృతి చెందిందని వైద్యులు తెలిపారు. ఆమె మృతితో శ్రావణి కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయింది.
