Minsiter KTR: బీజేపీ, కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్.. తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..

|

Dec 09, 2021 | 9:35 AM

Trs vs Bjp vs Congress: వరి ధాన్యం కొనుగోలు సహా పలు అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రపతిక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము గుజరాత్‌ గులాములం

Minsiter KTR: బీజేపీ, కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్.. తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్..
Ktr
Follow us on

Trs vs Bjp vs Congress: వరి ధాన్యం కొనుగోలు సహా పలు అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రపతిక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము గుజరాత్‌ గులాములం కాదంటూ తనదైన రీతిలో స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఉద్యమకారులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణకు ఏం చేశారని మీ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారంటూ బీజేపీపై ఎదురుదాడికి దిగారు. తెలంగాణకు బీజేపీ చేసింది శూన్యం అని విమర్శలు గుప్పించారు. మరోవైపు కేసీఆర్‌, కేటీఆర్‌లు బియ్యం దొంగలని ఆరోపించిన బీజేపీ ఎంపీలపైనా మండిపడ్డారు కేటీఆర్‌. మెదడు మోకాళ్లలోకి జారిందా? అని ప్రశ్నించారు. మీలా తామేమీ గుజరాత్‌ గులాములం కాదంటూ కౌంటర్‌ ఇచ్చారు.

ధాన్యం విషయంలో కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టిఆర్‌ఎస్‌ నేతలు, ఇటు ఉద్యమకారులను బీజేపీ తన పార్టీలోకి ఆహ్వానిస్తుండటంతో మరింతగా రగిలిపోతున్నారు. బీజేపీ ఏం చేసిందని ఆ పార్టీ కండువా కప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం విషయంలో అవలంభిస్తున్న ద్వంద్వ విధానాన్ని ఎండగడుతున్నారు. పంజాబ్‌కు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు టీపీసీసీ నేతలపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్‌. రేవంత్‌ టీపీసీసీ చీఫ్‌ కాదు చీప్‌ అంటూ సెటైర్‌ వేశారు. ధాన్యం విషయంలో తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడినా, ప్రతిపక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నాయన్నారు కేటీఆర్‌.

Also read:

 Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..

Black Box not yet found: అసలేం జరిగింది..? బ్లాక్‌బాక్స్‌ ఎక్కడా..? ప్రమాద స్థలంలో వెతుకుతున్న అధికారులు..

Army Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదానికి ముందు సాయితేజ తన భార్యతో వీడియో కాల్‌.. పిల్లలతో కొద్దిసేపు సరదాగా..