హైదారబాద్ అంబర్‌పేట్‌లో వీథికుక్కల దాడిలో బాలుడు చనిపోయిన ఘటనపై తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. బాలుడి కుటుంబానికి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీధికుక్కల బెడద నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూస్తామని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి కుటుంబ సభ్యులకు మంత్రి సంతాపం తెలిపారు. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి చాలా బాధాకరమని అన్నారు. సిటీలో కుక్కల నియంత్రణ కోసం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ మున్సిపాలిటీలోనూ వీధి కుక్కల సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. దీని కోసం జంతు సంరక్షణ కేంద్రాలను, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు.
కాగా.. కాగా వీధి కుక్కలు దాడి చేయడంతో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం తండ్రి పనిచేస్తున్న కారు సర్వీస్ సెంబర్ వద్దకు వెళ్లిన చిన్నారిని వీధి కుక్కలు వెంటాడాయి. కుక్కలను చూసి భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు పరుగులు తీసినా.. అవి వదలకుండా దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటినా ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొడుకు మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, కుక్కులు దాడి చేసిన దృశ్యాలు.. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కాగా, అంబర్‌పేట ఘటనపై మేయర్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు మేయర్ గద్వాల విజయలక్ష్మి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్‌లో వీధికుక్కల బెడదపై విమర్శలు వస్తుండటంతో ఈ ఘటనపై GHMC దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..