AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: అలాంటి వీడియోలతో జాగ్రత్త… క్యాడర్‌ను అలర్ట్ చేసిన మంత్రి కేటీఆర్‌..

దీంతో పలువురు సినీ, రాజకీయ నాయకులు సైతం స్పందించారు. డీప్‌ ఫేక్‌ వీడియోలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై దృష్టిసారించింది. ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సైతం డీప్‌ ఫేక్‌ వీడియోలపై స్పందించిన విషయం తెలిసిందే. రష్మిక వీడియోపై గతంలో స్పందించిన కేటీఆర్‌.. ఇదొక అవమానకరమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే...

KTR: అలాంటి వీడియోలతో జాగ్రత్త... క్యాడర్‌ను అలర్ట్ చేసిన మంత్రి కేటీఆర్‌..
KTR
Narender Vaitla
|

Updated on: Nov 24, 2023 | 10:25 AM

Share

డీప్‌ ఫేక్ వీడియో.. ఈ మధ్య కాలంలో దీనిపైనే చర్చ నడుస్తోంది. నటి రష్మిక మందనకు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో ఈ అంశం చర్చకు వచ్చింది. ఒక వ్యక్తి శరీరానికి మరో వ్యక్తి ముఖాన్ని జోడించి రూపొందించే వీడియోలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. సెలబ్రిటీలకు ఇదో పెద్ద తలకాయ నొప్పిగా మారింది.

దీంతో పలువురు సినీ, రాజకీయ నాయకులు సైతం స్పందించారు. డీప్‌ ఫేక్‌ వీడియోలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై దృష్టిసారించింది. ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్‌ సైతం డీప్‌ ఫేక్‌ వీడియోలపై స్పందించిన విషయం తెలిసిందే. రష్మిక వీడియోపై గతంలో స్పందించిన కేటీఆర్‌.. ఇదొక అవమానకరమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకువస్తే వాటిని తెలంగాణలో అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. ఈ డీప్‌ ఫేక్‌ వీడియోలు రాజకీయాలను సైతం వదలడం లేదు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి కొన్ని వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రాజకీయనాయకులు తాము అనని మాటలు అంటున్నట్లు రూపొందించి వీడియోలను సర్క్కూలేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వీడియోలతో జాగ్రత్తగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ట్విట్టర్‌ వేదికగా ఈ విషయమై క్యాడర్‌కు, సోషల్‌ మీడియా సైనికులకు దిశా నిర్దేశం చేశారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్..

ఈ విషయమై మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేస్తూ.. ‘బీఆర్‌ఎస్‌ పార్టీ క్యాడర్‌కు, సోషల్‌ మీడియా సోల్జర్స్‌ ఒక అలర్ట్‌. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చాలా ఫేక్‌/తప్పుడు/డీప్‌ ఫేక్‌ వీడియోలు వైరల్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మోసాలకు ఓటర్లు ప్రభావితం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’ అంటూ రాసుకొచ్చారు.

త్వరలోనే కొత్త నిబంధనలు..

సమస్యగా మారిన డీప్‌ ఫేక్‌ పోస్టుల నియంత్రణకు త్వరలోనే కొత్త నిబంధనలు విడుదల చేస్తామని కేంద్ర కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ తెలిపారు. ఫేక్‌ పోస్టులను రూపొందించిన వారికి శిక్ష, జరిమానాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.ఇలాంటి పోస్టులు.. ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయన్న కేంద్రమంత్రి.. వ్యవస్థలపై ప్రజల నమ్మకాన్ని ఇవి బలహీనపరుస్తాయన్నారు. డీప్‌ఫేక్‌ను నియంత్రించడానికి రానున్న 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పుకొచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..