Komatireddy Venkat Reddy – KCR: వాళ్ల పేర్లు నేను చెబుతా.. మీరు చెబుతారా..? కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఛాలెంజ్..

|

Apr 24, 2024 | 1:03 PM

టీవీ9 వేదికగా మాజీ సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాము అర్భకులం కాదు..అర్జునులమై పోరాడాం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ అమలు చేసే హామీలే ఇచ్చింది అంటూ కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Komatireddy Venkat Reddy - KCR: వాళ్ల పేర్లు నేను చెబుతా.. మీరు చెబుతారా..? కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఛాలెంజ్..
Komatireddy Venkat Reddy - KCR
Follow us on

టీవీ9 వేదికగా మాజీ సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తాము అర్భకులం కాదు..అర్జునులమై పోరాడాం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ అమలు చేసే హామీలే ఇచ్చింది అంటూ కోమటిరెడ్డి పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 12 ఎంపీ స్థానాలు వస్తాయి.. బీఆర్‌ఎస్‌కు 8 స్థానాలు వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. కేసీఆర్‌ ఏం చేస్తారో చెప్పాలి?.. అంటూ మంత్రి కోమటిరెడ్డి సవాల్ చేశారు.

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు వస్తా అన్నారు.. బీఆర్‌ఎస్‌లోకి వెళ్లే పాతికమంది ఎమ్మెల్యేలు ఎవరో చెప్పాలి? కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంటూ సూచించారు. తాను కాంగ్రెస్‌లోకి వచ్చే ఎమ్మెల్యేల పేర్లు చెబుతా.. అంటూ తెలిపారు. లిక్కర్‌ స్కామ్‌పై కేసీఆర్‌ తెలిసే మాట్లాడుతున్నారా? ఎమ్మెల్సీ కవిత ఏ ముత్యమో త్వరలో తెలుస్తుందన్నారు. సీఎం అయినా..ఎమ్మెల్సీ అయినా తప్పు చేస్తే జైలుకు వెళ్లాల్సిందే అన్నారు. రూల్స్‌ అందరికీ ఒకేలా ఉంటాయి..ఇదికూడా కేసీఆర్‌కు తెలియదా? ఫోన్‌ ట్యాపింగ్‌ బాధ్యత అప్పటి ప్రభుత్వానిదే అంటూ మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

వీడియో చూడండి..

రజినీకాంత్ లైవ్‌ షో విత్ కేసీఆర్.. లైవ్ ప్రొగ్రాంలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ.. అని.. కేసీఆర్ పేరును చెరపడం ఎవరివల్లా సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చిందని.. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారన్నారు. అంతేకాకుండా.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారం రేపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..