Telangana: బీజేపీతో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.. ప్రధాని మోడీపై మళ్లీ విరుచుకుపడ్డ మంత్రి జగదీశ్‌ రెడ్డి

Minister Jagadish Reddy : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల మంటలు చెలరేగాయి. ఎరువుల గోదాం శంకుస్థాపనకు వచ్చిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి డైరెక్టర్లపై విరుచుకుపడ్డాడు.

Telangana: బీజేపీతో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.. ప్రధాని మోడీపై మళ్లీ విరుచుకుపడ్డ మంత్రి జగదీశ్‌ రెడ్డి
Minister Jagadish Reddy

Updated on: Sep 24, 2022 | 8:13 AM

Minister Jagadish Reddy : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల మంటలు చెలరేగాయి. ఎరువుల గోదాం శంకుస్థాపనకు వచ్చిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి డైరెక్టర్లపై విరుచుకుపడ్డాడు. సభలో యాదాద్రి డీసీసీబీ డైరెక్టర్ గొంగిడి మహేందర్ రెడ్డి గుజరాత్ లో ఫెన్షన్ విధానంపై మాట్లాడుతుండగా స్టేజ్ మీద ఉన్న మరో ఇద్దరు బీజేపీ డైరెక్టర్లు అడ్డుపడ్డారు. ఇది పొలిటికల్ సభకాదు.. అంటూ అభ్యంతరం తెలిపారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని బీజేపీ డైరెక్టర్లను కిందికి పంపడంతో రగడ కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే ఈఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. బీజేపీ ప్రభుత్వాల బట్టలు విప్పుతా, బీజేపీ కసాయి ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే దమ్ము బీజేపీకి ఉందా.. కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. బీజేపీతో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామ్ అంటూ ఘాటుగా ఫైర్ అయ్యారు మంత్రి జగదీశ్.

కాగా అంతేకాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బీజేపీ నాయకులకు కోపం వస్తుందంటూ ఫైర్ అయ్యారు మంత్రి జగదీశ్‌. బీజేపీ రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రైతులపై విషం కక్కుతున్న మోడీ పది సార్లు రాష్ట్రానికి వచ్చినా తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు మంత్రి.

ఇవి కూడా చదవండి

మళ్లీ తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..