
Nirmal , July 19: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వాన తిప్పలు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ముసురు కమ్ముకోవడంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యాక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వరద ఏర్పడిన బురదే స్వాగతం పలుకుతుంది. బురదమయమైన రోడ్లపై ఆపసోపాలు పడుతూ నడవక తప్పని పరిస్థితి. నిర్మల్ జిల్లా రూరల్ మండలం న్యూ పోచంపాడ్ గ్రామంలోని రైతు వేదికలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 24 గంటల ఉచిత విద్యుత్ పై అవగాహన సదస్సు ఏర్పాటుకు హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇదిగో ఇలా బురదలో అత్యంత జాగ్రత్తగా అడుగులో అడుగేస్తూ సాగారు.
ముసురు వానకు రైతువేదిక గేటు నుంచి భవనం వరకు మొత్తం రోడ్డంతా బురదమయంగా మారడంతో తప్పని పరిస్థితుల్లో బురదలోనే నడక సాగించారు. రైతు వేదిక ప్రాంగణమంతా బురదతో చిత్తడి చిత్తడి గా మారడంతో కాలు తీసి కాలు వేయలేని పరిస్థితి ఏర్పండింది. మంత్రి వెంట వచ్చిన జిల్లా అదికారులు, ప్రజాప్రతినిధులు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి వస్తున్నాడని తెలిసిన మట్టి పోయారా అంటూ కొందరు బీఆర్ఎస్ నేతలు అదికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సైతం పరిస్థితి పై అసహనం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..