Minister Harish Rao: మాస్టారుగా మారిన మంత్రి హరీష్ రావు.. పాఠశాల విద్యార్థులతో సరదాగా కాసేపు..

|

Feb 24, 2021 | 8:30 PM

Minister Harish Rao: తెలంగాణ ఉద్యమ నేతగా ప్రస్థానం ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్ రావులో ఎన్నో కోణాలున్నాయి.

Minister Harish Rao: మాస్టారుగా మారిన మంత్రి హరీష్ రావు.. పాఠశాల విద్యార్థులతో సరదాగా కాసేపు..
Follow us on

Minister Harish Rao: తెలంగాణ ఉద్యమ నేతగా ప్రస్థానం ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్ రావులో ఎన్నో కోణాలున్నాయి. ప్రజా నాయకుడిగా.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాందవుడిగా పేరుపొందిన హరీష్.. నిత్యం ప్రజల మధ్యే ఉంటుంటారు. అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తుంటారు. ఇటీవలే క్రికెటర్ అవతారమెత్తిన హరీష్.. తాజా స్కూల్ మాస్టార్‌గా మారారు. అసలు విషయంలోకి వెళితే.. మెదక్ జిల్లా పాపన్న పేట మండలం, కొత్తపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఆ సందర్భంగా మాస్టారుగా మారిన హరీష్ రావు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. కరోనా అనంతరం పాఠశాల ఎలా నడుస్తుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

తెలుగు, గణితం పాఠ్యాంశాల్లో విద్యార్థుల ప్రావీణ్యతను పరీక్షించారు. అంతేకాదు.. విద్యార్థుల లక్ష్యాలేంటో అడిగి తెలుసుకున్న హరీష్ రావు.. ‘డాక్టర్ కావాలంటే ఏం చదవాలి? డాక్టర్ అయితే అమెరికా వెళ్తావా? లేక ఇక్కడే ఉండి ప్రజలకు సేవ చేస్తావా?’ అంటూ ఓ విద్యార్థితో సరదాగా ముచ్చటించారు. ఇక ఓ విద్యార్థి తాను పోలీసు అవుతానని చెప్పగా.. పోలీస్ అయితే ఏం చేస్తావ్ అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. దానికి ఆ పిల్లాడు ప్రజలకు రక్షణగా నిలుస్తానంటూ సమాధానం ఇవ్వడంతో శభాష్ చెప్పారు. ఇక మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై మాట్లాడమని పలువురు విద్యార్థులను హరీష్ రావు కోరారు. అలాగే.. తెలుగు నుడికారాలు, జాతీయాలు, సామెతలు, సొంత వాక్యాలపై పలు ప్రశ్నలు వేశారు. కరోనా వల్ల చదువు కోల్పోయారా? అని ఆరా తీశారు. అలాగే మధ్యాహ్నం భోజన వసతిపైనా ఆరా తీశారు. చివరగా పాఠశాల నుంచి వెళుతూ.. విద్యార్థులను మరింత సానబట్టాలని ఉపాధ్యాయులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

Also read:

నటి శ్రీదేవి వర్ధంతి.. సోషల్ మీడియాలో ఉద్వేగభరిత పోస్టు చేసిన కూతుళ్లు జాన్వీ, ఖుషీ..

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!