తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఒకే రోజు నియామకం చేపట్టామని మంత్రి హరీష్‌రావు అన్నారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు జరిగాయన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘వైద్యాన్ని పటిష్టం చేసేందుకు కొత్త మెడికల్ కాలేజీలు, సిబ్బంది నియామకాలు భారీగా చేపడుతున్నాం. వైద్య విద్యలో దేశంలోనే ఇది రికార్డ్. ఈ సంత్సరంలో 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. అందులో భాగంగా ఇవాళ 1061 మంది రిక్రూట్మెంట్ చేశాం. గత నెలలో 900 మందికి పైగా ఉద్యోగాలు పొందారు. 1331 మంది ఆయుష్ పారా మెడికల్‌లో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని పెర్మినెంట్ చేస్తాం. తెలంగాణ ఏర్పడిన తరువాత 22,263 మందికి ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇచ్చాం. ఆరోగ్య శాఖలో మరో 9,222 పోస్టులకు మరో రెండు నెలల్లో నియామకాలు చేపడుతామని’ అన్నారు.
రోగుల ఆరోగ్యాన్నీ నయం చేయగల శక్తి వైద్యులకు ఉంటుంది. వైద్యులు సమాజానికి మంచి సేవలు అందించాలి. రోగులను ఆత్మీయంగా పలకరించాలి. ఒకటి రెండు ఘటనలతో ఆరోగ్య శాఖ పెరు చెడిపోకూడదు. ప్రాణాలు కాపాడే గొప్ప వృత్తి వైద్యులది. గతంలో జబ్బులు వస్తే ఆ కుటుంబమే ఆర్ధికంగా చితికిపోయేది. ఇప్పుడు జిల్లాల్లో సూపర్ స్పెషలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పేదలకు మంచి వైద్యం అందుతోంది. వరంగల్ లాంటి టీచింగ్ ఆస్పత్రుల్లోనూ విజయవంతంగా ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్‌లు జరుగుతున్నాయి. భారత్‌లో అత్యధిక ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్‌లు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. 100% ఇన్సిట్యూషనల్ డెలివారీలు తెలంగాణలో జరుగుతున్నాయి. ప్రతి నెల 11న మీ అందరితో రివ్యూలో మాట్లాడుతాను. రివ్యూ మీటింగ్‌లో సమస్యలు, సొల్యూషన్స్ గురించి చర్చిద్దామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీ డయగగ్నోస్టిక్స్‌లలో 54 టెస్టులు చేస్తున్నాం. వచ్చే నెల నుండి 134 టెస్ట్ లు అందుబాటులోకి వస్తాయి. గత ప్రభుత్వాలు మెడికల్ విద్యను, వైద్యాన్ని పట్టించుకోలేదు. దాని వల్ల చాలా మంది విద్యార్థులు ఇతర దేశాలకి వెళ్లి చదువుకున్నారు. తెలంగాణ వస్తే ఎం వస్తది అని మాట్లాడిన వారికి ఇది సమాధానం…వైద్య విద్య వచ్చింది, వైద్యం వచ్చింది. 4 ఏళ్ల క్రితం ఇచ్చిన ఎయిమ్స్ నిర్మాణానికి వచ్చిన మోడీ ఎంత హడావిడి చేశారో చూసాం. కానీ మనం ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు నిర్మించుకున్నాం. శ్రమ కృషి వల్ల ఇది అంత సాధ్యం అయింది. ప్రతి లక్ష మంది కి 22mbbs సీట్లు ఉన్న రాష్ట్రం తెలంగాణ. వైద్య సేవల్లో మన రాష్ట్రం దేశానికే ఆదర్శం అని మంత్రి హరీష్ అన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.