
సిద్ధిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో క్యాన్సర్ కీమో థెరఫీ డే కేర్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి పేషెంట్ల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి వార్డుల్లోని పేషెంట్లను పరామర్శించి.. మంత్రి హరీష్‌రావు వారి బాగోగులు అడిగితెలుసుకున్నారు. మంత్రి ప్రశ్నలకు సమాధానం చెపుతూ.. పిడికెడు అన్నం పెట్టడానికి కూడా ఏడుస్తున్నారంటూ ఆసుపత్రి సిబ్బంది వైఖరిని మంత్రికి వివరించారు పేషెంట్లు.. రెండు పూటలా గుడ్లు, భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని మంత్రికి పేషెంట్ బంధువులు గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో హరీష్ రావు ఆసుపత్రి సిబ్బందిపై మండిపడ్డారు. ఇకమీదట ఇలాంటి ఫిర్యాదులు వస్తే సహించేది లేదంటూ స్పష్టం చేశారు.
సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 50మంది వికలాంగులకు హోండా స్కూటీ లు పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వని విధంగా దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు.
పేరుకు మాత్రమే డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ విమర్శించిన మంత్రి.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వెయ్యి మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని విమర్శించారు. ఫేక్ సోషల్ మీడియా సొట్టకాయలను నెత్తిమీద మొట్టినట్టు తెలంగాణ అభివృద్ధి గురించి చాటిచెప్పాలన్నారు మంత్రి హరీష్‌రావు.
దివ్యాంగులు అందరితో సమానంగా ఉండాలని, వారిని కష్టాల నుంచి దూరం చేయాలనే ఉద్దేశ్యంతో గతనెలలో 21 మందికి స్కూటీలు పంపిణీ చేయగా తాజాగా 50 స్కూటీలను పంచిపెట్టామన్నారు మంత్రి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..