తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల క్రితమే పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేశారు మంత్రి సబితా ఇంద్ర రెడ్డి. ఈ సారి టెన్త్‌ఫలితాల్లో రాష్ట్రం నుండి గతంలో కన్నా అధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా కొన్ని చోట్ల అస్సలు ఒక్క విద్యార్థి కూడా పాస్ అవ్వని స్కూల్స్ మొత్తం 25 ఉన్నాయి. అయితే, ఈ సారి పది ఫలితాల్లో సిద్దిపేటకు రెండవ స్థానం రావడం పట్ల మంత్రి హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎవరైతే 10/10 జీపీఏ సాధించారో వారికి మంత్రి హరీష్ రావు రూ.10 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. మంత్రి చేసిన ప్రకటన విద్యార్థుల్లో కొత్త ఆనందాన్ని కలిగిస్తోంది.
సిద్ధిపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సిద్ధిపేట జిల్లాలో టెన్త్ క్లాస్ లో 10 కి 10 GPA సాధించిన విద్యార్థులు అందరికీ రూ. 10,000 చొప్పున నగదు బహుమతి అందించడానికి పూనుకున్నారు. అంతేకాకుండా 100 శాతంతో పాస్ అయిన ప్రభుత్వ పాఠశాలలకు రూ.25 వేలు నగదు పురస్కారాన్ని విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు.
అయితే, ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 126 మంది విద్యార్థులకు 10 కి 10 జీపీఏ రాగా 219 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. బుధవారం వెలువడిన ఎస్‌ఎస్‌సీ పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. వరుసగా నాలుగేళ్లుగా జిల్లా మొదటి మూడు స్థానాల్లో నిలిచింది.
గతేడాది 97.85 శాతం ఉత్తీర్ణత శాతాన్ని 98.65 శాతానికి పెంచినప్పటికీ 2021-22లో జిల్లా ప్రథమ స్థానం నుంచి ఈ ఏడాది రెండో స్థానానికి పడిపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో 126 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా, 219 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి. ఆర్థిక మంత్రి టి హరీష్ రావు హామీ ఇచ్చిన ప్రకారం , ఈ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 10,000 నగదు బహుమతిని అందజేస్తామని, 100 శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు రూ.25,000 బహుమతిని అందజేస్తామని తెలిపారు. ఎనిమిది మండలాల్లోని అన్ని పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..