Asaduddin Owaisi: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..

| Edited By: Shaik Madar Saheb

Jan 03, 2024 | 9:01 AM

అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తున్న వేళ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మూడు, నాలుగు మసీదులపై కుట్ర జరుగుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. స్వదేశంలో నివాసం ఉంటూ మసీదులపై శ్రద్ధ వహించాలని ముస్లీం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. బాబ్రీ మసీదు గురించి ప్రస్తావిస్తూ, గత 500 ఏళ్లుగా పవిత్ర ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదని తెలిపారు.

Asaduddin Owaisi: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..
Assaduddin Owaisi
Follow us on

అయోధ్య రామాలయ ప్రతిష్ఠాపనకు ముహూర్తం సమీపిస్తున్న వేళ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మూడు, నాలుగు మసీదులపై కుట్ర జరుగుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. స్వదేశంలో నివాసం ఉంటూ మసీదులపై శ్రద్ధ వహించాలని ముస్లీం సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేశారు. బాబ్రీ మసీదు గురించి ప్రస్తావిస్తూ, గత 500 ఏళ్లుగా పవిత్ర ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదని తెలిపారు. ముస్లిం యువకులు అప్రమత్తంగా ఉంటూ, ఐక్యంగా ముందుకు సాగాలని దిశానిర్ధేశం చేశారు. తమ సమీపంలోని మసీదుల్లో ఎప్పుడూ జనాలుండేలా చూసుకోవాలని హితవు పలికారు.

అయోధ్య తీర్పు గురించి క్లుప్తంగా..

అయోధ్య వివాదంపై 2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. అయోధ్యలో బ్రహ్మాండమైన రామ మందిర నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలను తీసుకునేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆలయ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో పధాన భూమిక పోషించింది. ఆ తరువాత 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం 2024 జనవరి 16న ప్రారంభమై ఏడు రోజుల పాటు కన్నుల పండువగా జరగనుంది. చివరి రోజు జనవరి 22న ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించినంతరం ‘మృగశిర నక్షత్రం’లో రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..