AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: వారికే నామినేటెడ్ పదవులు.. ఆ ప్రాంతాల మీదుగా ఎయిర్‌పోర్ట్‌కి మెట్రో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

మెట్రో కానీ, ఫార్మాసిటీని కానీ రద్దు చెయ్యడం లేదు.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మియాపూర్ నుంచి ఆర్సీపురం వరకూ మెట్రోను విస్తరించడంతోపాటు.. గతంలో ప్రతిపాదించినట్లుగా రాయదుర్గం నుంచి కాకుండా పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్ట్‌కి మెట్రోను తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Revanth Reddy: వారికే నామినేటెడ్ పదవులు.. ఆ ప్రాంతాల మీదుగా ఎయిర్‌పోర్ట్‌కి మెట్రో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Revanth Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jan 01, 2024 | 7:44 PM

Share

మెట్రో కానీ, ఫార్మాసిటీని కానీ రద్దు చెయ్యడం లేదు.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని స్ట్రీమ్‌లైన్ చేస్తున్నాం.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మియాపూర్ నుంచి ఆర్సీపురం వరకూ మెట్రోను విస్తరించడంతోపాటు.. గతంలో ప్రతిపాదించినట్లుగా రాయదుర్గం నుంచి కాకుండా పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్ట్‌కి మెట్రోను తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని, ఎయిర్పోర్టుకి ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. BHEL నుంచి ఎయిర్పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు వస్తుంది.. ఎంజిబిఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు మెట్రో ఉంటుందన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓఎస్ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్పోర్టుకి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామన్నారు. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రపురం వరకు మెట్రో పొడిగిస్తామంటూ రేవంత్ పేర్కొన్నారు.

అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్నారు. గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్పోర్టుకి మెట్రో వెళ్లేవారు దాదాపు ఉండరన్నారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందన్నారు. ఫార్మాసిటీని అంచలంచలుగా రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడి పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి గృహనిర్మాణం కూడా ఉంటుందన్నారు. అక్కడి వాళ్ళు ఎవ్వరు కూడా హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేట్లు క్లస్టర్లు ఉంటాయన్నారు.

గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన. ప్రముఖ పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా ఈ స్కిల్స్ పై శిక్షణ ఉంటుందన్నారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని.. స్కిల్స్ అదనంగా ఉంటాయని వివరించారు. అక్కడ నుంచి బయటకి వెళ్ళేవాళ్ళకి క్యాంపస్ లోనే ఎంపిక ఉంటుందన్నారు.

ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇంచార్జిలుగా బాధ్యతలు అప్పగించామన్నారు. 100 బెడ్స్ ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు. ఆయా దేశాలకు అవసరమైన మాన్ పవర్ ను ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు. ఇందువల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామన్నారు. మన దగ్గర పెద్ద సంఖ్యలో యువత ఉందని.. వారికి ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. చాలా మంది సీనియర్ అధికారులు ప్రావీణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉందన్నారు.

3వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉందని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. తనకు దగ్గరనో.. లేదా భందువులనో పదవులు ఇచ్చేది ఉండదన్నారు. తాను ఏది చేసినా విస్తృతస్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తామన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇస్తామని.. ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ల కమిషనర్లను నియమించామని.. వారికి అవసరమైన మాన్ పవర్ ను వాళ్ళే పిక్ చేసుకుంటారన్నారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు తాను చూస్తానన్నారు. వాళ్ళ పరిధిలో అవసరమైన అధికార్లను నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేట్లు చూసుకోవాలన్నారు.

అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తామని సీఎం పేర్కొన్నారు. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నానని.. తన వద్ద చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండదన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాని.. ఇప్పటి నుంచి వంద రోజుల్లో పరిష్కారమయ్యేలా కృషి చేస్తానన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..