Chiranjeevi: మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్.. బర్త్ డే వేళ 24 విభాగాల్లోని సినీ కార్మికులకు స్వీట్ న్యూస్

|

Aug 22, 2021 | 10:24 PM

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్దమనసుని చాటుకున్నారు. కరోనా సంక్షోభంలో సినీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలిచి

Chiranjeevi: మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్.. బర్త్ డే వేళ 24 విభాగాల్లోని సినీ కార్మికులకు స్వీట్ న్యూస్
Chiranjeevi
Follow us on

Megastar – Birthday Gift – Film Industry: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్దమనసుని చాటుకున్నారు. కరోనా సంక్షోభంలో సినీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలిచి దాతృత్వాన్ని ప్రదర్శించిన చిరు.. ఇవాళ తన జన్మదినాన్ని పురస్కరించుకొని 24 విభాగాల్లోని సినీకార్మికులకు స్వీట్ న్యూస్ చెప్పారు

సినీ రంగంలోని 24 విభాగాల్లోని సినీ కార్మికుల ఆరోగ్యం దృష్ట్యా చిత్రపురి కాలనీలో 10 పడకల ఆస్పత్రిని నిర్మించనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. అపోలో ఆస్పత్రి సహకారంతో అన్ని రకాల వైద్య చికిత్సలు అందేలా ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరలోనే చేపడతానని చిరంజీవి హామీ ఇచ్చినట్లు సినీనటుడు శ్రీకాంత్ వెల్లడించారు.

కాగా, కరోనా సంక్షోభ సమయంలో.. సినీ కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ, టీకాలు చిరంజీవి వేయించిన సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజును సందర్భంగా చిత్రపురి కాలనీ హౌసింగ్​ సొసైటీలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాంత్.. రక్తదానం చేసిన సినీ కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆస్పత్రి నిర్మాణానికి ఇచ్చిన హామీని శ్రీకాంత్ కార్మికులతో పంచుకున్నారు.

Read also: Chiranjeevi: చిరు ఇంట కన్నుల పండుగ.. రక్షా బంధన్, బర్త్ డే వేడుక, బ్రదర్స్‌కు రాఖీలు కట్టిన మెగా సోదరీమణులు.. వాచ్ వీడియో