RIMS Medical College: అదిలాబాద్ రిమ్స్‎లో అర్థరాత్రి ఆగంతకుల హల్ చల్.. రంగంలోకి పోలీసులు.. ఆ తరవాత ఏం జరిగిందంటే..

ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారు. క్యాంపస్ కి సంబంధం లేకుండా బయట వ్యక్తులు క్యాంపస్ లో చొరబడ్డారు. అలాగే విద్యార్థులపై దాడులకు ప్రయత్నించారు. దీంతో రిమ్స్ విద్యార్ధులు, బయటి వ్యక్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. రిమ్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను కారుతో ఢీకొట్టి పరారయ్యారు బయటి వ్యక్తులు.

RIMS Medical College: అదిలాబాద్ రిమ్స్‎లో అర్థరాత్రి ఆగంతకుల హల్ చల్.. రంగంలోకి పోలీసులు.. ఆ తరవాత ఏం జరిగిందంటే..
Rims Medical College, Adilabad.

Updated on: Dec 14, 2023 | 8:34 AM

ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కళాశాల ఆవరణలో అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారు. క్యాంపస్ కి సంబంధం లేకుండా బయట వ్యక్తులు క్యాంపస్ లో చొరబడ్డారు. అలాగే విద్యార్థులపై దాడులకు ప్రయత్నించారు. దీంతో రిమ్స్ విద్యార్ధులు, బయటి వ్యక్తుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. రిమ్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులను కారుతో ఢీకొట్టి పరారయ్యారు బయటి వ్యక్తులు.

తమపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన వారిపై వైద్య విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు ఎలాంటి అవాఛనీయమైన సంఘటనలు జరుగకుండా రిమ్స్ ఆవరణలో భద్రత పెంచారు. దాడి చేసి పారిపోతున్న బయటి వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేశారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఇలాంటి ఘటనకు పాల్పడటానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. అదుపులోకి తీసుకున్న ఆగంతకులను విచారిస్తున్నారు. కారులో వచ్చిన వారిని అడ్డుకోవాలని చూసిన రిమ్స్ విద్యార్థులపై దూసుకెళ్లిన ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. టీఎస్ 01 ఈఆర్ 0007 అనే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ కలిగిన కారులో వచ్చినట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..