AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: లక్షల జీతాలు ఇచ్చేది ఇందుకేనేమో?.. అధికారి ఒడ్డున కూర్చొని.. రైతుతో మరమ్మత్తులు..

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఎంతోమంది ప్రాణాల మీదకు వస్తున్న అధికారుల తీరులో మాత్రం అసలు మార్పు రావడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలో మరోసారి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఓ గ్రామంలో విద్యుత్‌ వైర్లు తెగి పొలంలో పడగా.. వాటని రైతు చేత తీపించాడు స్థానిక ఏఈ దీంతో.. ఆ అధికారి తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telangana: లక్షల జీతాలు ఇచ్చేది ఇందుకేనేమో?.. అధికారి ఒడ్డున కూర్చొని..  రైతుతో మరమ్మత్తులు..
Representative Image
P Shivteja
| Edited By: |

Updated on: Jan 12, 2026 | 2:59 PM

Share

నెల నెలా భారీ మొత్తంలో జీతం తీసుకునే కరెంటాఫీసరు దర్జాగా ఒడ్డు మీద కూర్చుంటే. ఆరుగాలం శ్రమిస్తే తప్ప అయిదువేళ్లు నోట్లోకి వెళ్లని బక్క రైతును కరెంటు స్తంభం ఎక్కి మరమ్మత్తులు చేశాడు. తాము చేయాల్సిన మరమ్మతు పనులను రైతులతో చేయిస్తూ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న విద్యుత్‌ అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో తూప్రాన్ వెళ్లే దారిలో 11కేవీ విద్యుత్ తీగలు తెగి రైతుల పొలాల్లో పడ్డాయి. మూడు రోజులు అయినా వాటిని తొలగించకపోవడంతో స్థానిక రైతులు ఈ సమస్యను విద్యుత్‌ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నర్సాపూర్ ఏఈ రామ్మూర్తి అక్కడకు చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వాటిని తొలగించకపోగా.. అక్కడే గట్టుపై కూర్చొని నారాయణ అనే రైతును స్తంభాలు ఎక్కించి మరమ్మతులు చేయించాడు. ఇందేంటని స్థానిక రైతులు నిలదీయగా.. సిబ్బంది లేదరని ఏఈ నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు. దీంతో సదురు అధికారి తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు, సిబ్బంది లక్షల్లో జీతాలు తీసుకుంటూ పనిచేయకుండా ఇలా రైతులతో పనిచేయించడం ఏంటని.. ఇలాంటి అధికారుల పై తప్పకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇదే విషయం పై జిల్లా విద్యుత్ ఎస్సీ నారాయణ నాయక్ ను టీవీ9 వివరణ కోరగా ఇప్పటివరకు ఈ విషయం తన దృష్టికి రాలేదని.. ఈ విషయం పై సమగ్ర విచారణ చేయించి.. సదరు అధికారిపై, అక్కడ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణలో ఎయిర్‌పోర్టుల్లా మారనున్న 5 రైల్వే స్టేషన్లు!
తెలంగాణలో ఎయిర్‌పోర్టుల్లా మారనున్న 5 రైల్వే స్టేషన్లు!
100 రోగాలకు ఒకటే మందు..! ఐరన్, కాల్షియం టాబ్లెట్లు వద్దు
100 రోగాలకు ఒకటే మందు..! ఐరన్, కాల్షియం టాబ్లెట్లు వద్దు
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త..
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి