Viral Video: పొలంలో కనిపించిన నల్లటి ఆకారం.. వామ్మో.. ఆ రైతు గుండె ఆగినంత పనైంది.. ఆ తర్వాత
మొసళ్లున్నాయి జాగ్రత్త.. పొలాల్లోకి వస్తున్నాయి పారా హుషార్. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మంజీరా నదీ పరివాహక ప్రాంతాల్లో మొసళ్లు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పొలాల్లోకి, జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా చిట్కుల్ మండలం చాముండేశ్వరి దేవాలయ సమీపంలో ఓ రైతు కంటపడింది ఓ మొసలి.. దీంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీశాడు.

మొసళ్లున్నాయి జాగ్రత్త.. పొలాల్లోకి వస్తున్నాయి పారా హుషార్. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మంజీరా నదీ పరివాహక ప్రాంతాల్లో మొసళ్లు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పొలాల్లోకి, జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా మెదక్ జిల్లా చిట్కుల్ మండలం చాముండేశ్వరి దేవాలయ సమీపంలో ఓ రైతు కంటపడింది ఓ మొసలి. వెంటనే సదరు రైతు భయంతో అక్కడి నుంచి పరుగులు తీసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఇక 15 రోజుల క్రితం ఆందోల్ మండలం అల్మాయిపేట శివారులోని మంజీరా నది ఒడ్డుపై ఓ బండరాయి పై మొసలి సేద తీరుతున్న దృశ్యం రైతుల కంట పడింది.
మంజీరా నదిలో మూడు మొసళ్ళు సంచరిస్తున్నట్టు మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో మత్స్యకారులు, మేకలకాపరులు, రైతులు, అటుగా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ఇక మొసళ్లను చూసిన కొందరు, వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వీలైనంత త్వరగా మొసళ్లను పట్టుకుని అక్కడ నుంచి తరలించాలని రైతులు, మత్స్యకారులు కోరుతున్నారు.
వీడియో చూడండి..
మొసళ్ల బెడదతో మంజీర బ్యాక్ వాటర్‌లో చేపల వేటకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు మత్స్యకారులు. ఇక కల్పగురులోని మంజీరా డ్యామ్ దగ్గర ఉన్న మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని మూసివేయడంతో కూడా ఈ సమస్య మరింత పెద్దదైంది. గతంలో ప్రత్యుత్పత్తి కేంద్రం ఉన్నప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లోకి మొసళ్లు అంతగా వచ్చేవి కావని, దాన్ని మళ్లీ ఓపెన్ చేయాలని రైతులు కోరుతున్నారు.
కోల్కూరులో మంజీరా పరివాహక ప్రాంతంలో సంచరిస్తున్న మొసలిని పట్టుకున్నారు అధికారులు. మొసళ్లు సంచరిస్తున్న నేపథ్యంలో రైతులు, పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మొసళ్లు కనిపించినప్పుడు వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా తమకు సమాచారం అందించాలని అటవీ అధికారులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..