Telangana: మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..! సైకో కిల్లర్ అరెస్ట్‌తో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు!

నిందితుడు ఎక్కువగా రైళ్లో ప్రయాణాలు చేస్తూ.. మద్యం షాపుల వద్ద హత్యలు చేయడం అలవాటుగా ఎంచుకున్నాడు.

Telangana: మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..! సైకో కిల్లర్ అరెస్ట్‌తో వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు!
Pshyco Killer Arrest
Follow us
P Shivteja

| Edited By: Balaraju Goud

Updated on: Nov 13, 2024 | 11:48 AM

పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న సైకో కిల్లర్‌ చిక్కాడు. చిన్న శంకరంపేట మండలంలో ఇటీవల జరిగిన రెండు హత్య కేసుల మిస్టరీని మెదక్ జిల్లా పోలీసులు ఛేదించారు. నిందితుడు సైకో కిల్లర్ వట్టెం మల్లేష్ తోపాటు అతనికి సహకరించిన నిందితుడు అన్న రమేష్ ను కూడా అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే అక్టోబర్‌ నెల మెదక్ జిల్లా చిన్న శంకరం పేట్ మండల కేంద్రంలో వరుస హత్యలు జరిగాయి. దీనితో ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. విచారణను వేగంవంతం చేయగా నిందితుని గురించి నిర్గాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా ఎస్పీ ఉదయ్ చెప్పిన వివరాల ప్రకారం నిందితుడు మల్లేష్ మద్యం సేవించాక సైకో లాగా మారుతాడు. మద్యం తాగినాక ఎవరినైనా కొట్టాలి.. లేదా చంపాలి అనే ఆలోచన వస్తుంది. అందుకే ఇప్పటి వరకు మూడు హత్యలఉ చేశాడు. మరో 5 హత్యాయత్నాలకు పాల్పడ్డట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

నిందితుడు ఎక్కువగా రైళ్లో ప్రయాణాలు చేస్తూ.. మద్యం షాపుల వద్ద హత్యలు చేయడం అలవాటుగా ఎంచుకున్నాడు. నిందితుడు మల్లేష్ పాత నేరస్తుడు. 2013లో చిన్న శంకరంపేట మండలంలోని తన సొంత ఊరు అయిన రుద్రారం గ్రామంలో నర్సయ్య అనే వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులో 2017లో జైలుకు వెళ్లి 2019 వరకు చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవించాడు. చిన్న శంకరంపేటలో గత నెల 24వ తేదీన కామారెడ్డి జిల్లా వాస్తవ్యుడు నవీన్ అనే వ్యక్తిని హత్య చేశాడు. అదే మండలం అనంత పద్మనాభ స్వామి గుట్ట బస్టాండ్ వద్ద నిజామాబాద్ జిల్లాకు చెందిన కొమీరే స్వామి అనే వ్యక్తిని హత్య చేశాడు.

అలాగే దీపావళి రోజున రైలులో సుత్తె తో ఓ వ్యక్తి తల పగులగొట్టి హత్యాయత్నం చేశాడు. ఇతని పై ఐదారు హత్య కేసులు ఉన్నాయి. వాటిపైన విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మల్లేష్ హత్య చేసిన వారి నుండి తీసుకున్న డబ్బులను, వస్తువులను తన మిత్రుడు రమేష్‌కు ఇస్తాడు. వరుస హత్యలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మల్లేష్‌ తోపాటు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి ఐదు సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, బంగారు చైన్, గోల్డ్‌ రింగ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..